పుష్పరాజ్ క్రేజ్ కి అమూల్ టీమ్ ఫిదా

Mon Jan 17 2022 13:55:26 GMT+0530 (IST)

Amul Team On Pushpa Movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ముత్యం షెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలై సంచలన విజయాం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.ఈ మూవీ విడుదలై నెలరోజులు కావస్తున్న బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం జోరు తగ్గడం లేదు. అంతే కాకుండా ఓటీటీలో విడుదలైనాక జోరు తగ్గుతుందని అంతా భావించారు కానీ ఓటీటీ రిలీజ్ తరువాత ఈ మూవీపై క్రేజ్ మరింతగా పెరిగింది. వసూళ్ల పరంగానూ రికార్డులు సృష్టిస్తోంది. ఇంత కాలం స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా స్క్రీన్ పై స్టైలిష్ గా కనిపించే బన్నీ తొలి సారి ఊర మాస్ పాత్రలో కనిపించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

అంతే కాకుండా అతని మేనరిజమ్స్ డైలాగ్స్ సినిమాకు హ్యూజ్ క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించిన తీరు అభిమానులతో సినీ ప్రియుల్ని కూడా ఫిదా చేసింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీకి అమూల్ ట్రీమ్ క్రేజీగా ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీలో బన్నీ చెప్పిన డైలాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ మూవీలోని పాటలకు ప్రముఖ స్టార్స్ సెలబ్రిటీలు స్టెప్స్ వేస్తూ వేరల్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ క్రేజ్ కి తాజాగా ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ ఫిదా అయింది. `పుష్పక్ ద స్లైస్` పేరుతో ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి పుష్ప టీమ్ ని అభినందించింది. అంతే కాకుండా బన్నీ రష్మిక పాత్రలని పోలివుండేలా కార్టూన్స్ ని క్రియేట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. అమూల్ టాపికల్ సరికొత్త యాక్షన్ డ్రామా మూవీ భారీ హిట్` అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాకుండా ఈ పోస్ట్ కు అముల్లు.. అర్జున్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ కి బన్నీ రిస్లై ఇచ్చాడు. అల్లు టు మల్లు టు అములు అర్జున్ అంటూ లవ్ ఎమోజీని షేర్ చేశారు బన్నీ.