అమ్మా నీ ఆశీర్వాదం తీసుకోలేక పోతున్నా : చిరంజీవి

Sat Jan 29 2022 16:23:08 GMT+0530 (India Standard Time)

Amma i can not take your blessings Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కోవిడ్ తో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఆయన స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. అయినా కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ఐసోలేషన్ అయ్యారు. నేడు చిరంజీవి తల్లి గారు అంజనా దేవి పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం తల్లి బర్త్ డే ను చాలా వైభవంగా చిరంజీవి నిర్వహిస్తూ ఉంటారు.ఆయన తల్లి పుట్టిన రోజు జరిపి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవారు. కాని ఈసారి మాత్రం తల్లి ఆశీర్వాదం తీసుకోకుండా కరోనా అడ్డు వచ్చింది. కరోనా వల్ల అమ్మను కలువలేక పోతున్నాను... ఆమె ఆశీర్వాదం తీసుకోలేక పోతున్నాను అంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. తల్లి అంటే చిరంజీవికి ఎంత అభిమానమో.. ప్రమో ఆయన గత పోస్ట్ లు మరియు వీడియోలను చూస్తే అర్థం అవుతుంది. తల్లికి ప్రత్యేకంగా వంట చేసి పెట్టడం మొదలుకుని ఆమె కు కావాల్సిన పనులు స్వయంగా చిరంజీవి దగ్గర ఉండి చేస్తారట.

చిరంజీవి ఈ పుట్టిన రోజుకు తల్లిని కలువలేక పోయారు. కాని ఆమెను కలిసి నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ లు ఆశీర్వాదం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ఇప్పటికే కరోనా బారిన పడి వారం అవుతుంది. కనుక ఆయన ఇప్పటికే కరోనాను జయించి ఉంటారు. కాని రూల్ ప్రకారం కనీసం పది నుండి పది హేను రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చిరంజీవి ఇంకా కూడా క్వారెంటైన్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ఈసారి తల్లి పుట్టిన రోజు మిస్ అవ్వడం పట్ల అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి త్వరగా కరోనా నుండి కోలుకుని మళ్లీ నార్మల్ జీవితం ను గడపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను కొత్త తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 1న ఈ సినిమా ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మలయాళ లూసీఫర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్ మరియు తమిళ వేదాళంకు రీమేక్ గా భోళా శంకర్ సినిమాను చిరంజీవి చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు. ఇప్పటికే ఆసినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చిరంజీవి చేసేందుకు ఓకే చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు గాను సిద్దం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

--