వయసు 50కి సమీపిస్తోంది. 46 బార్డర్ దాటి 47లో (9జూన్ బర్త్ డే) అడుగుపెట్టేందుకు ఇంకెన్నో రోజులు లేదు. అయినా కానీ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే! అంటూ చెలరేగుతోంది. పండుటెంట్రుకలు కళ్ల కింద లూజ్ సంచులు స్పష్ఠంగా కనిపిస్తున్నా.. ఇప్పటికీ నవనాయికలా మెరిపించాలని కలలు కంటోంది. ఇంతకీ ఎవరీ భామ అంటే.. అమీషా పటేల్.. పరిచయం అవసరం లేని పేరు ఇది.
పవన్ కల్యాణ్ సరసన బద్రి చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించిన ఈ అమ్మడు హృతిక్ సరసన 'కహోనా ప్యార్ హై' చిత్రంతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసింది. వయసుడిగిపోతున్నా ఇంకా యూత్ వైబ్స్ కోసం తపన పడుతోంది. తాను ఎంతగా ప్రయత్నించినా బాలీవుడ్ లో ఆశించిన అవకాశాలు అందుకోవడంలో విఫలమవుతోంది. అదే క్రమంలో సోషల్ మీడియాల్లో నిరంతరం హాటెస్ట్ ఫోటోషూట్లతో దుమ్ము రేపుతోంది.
ఈ బ్యూటీ నిరంతర బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సామాజిక మాధ్యమాల్లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. నెవ్వర్ బిఫోర్ కిల్లింగ్ లుక్ తో మరోసారి అమీషా తన ఫాలోవర్స్ గుండెల్ని గుల్ల చేసింది.
అయితే ఈ ఫోటోషూట్ పై ఒక రేంజులో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. లేట్ ఏజ్ లో ఘాటు అందాలు! అంటూ నెటిజనులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
అమీషా ప్రస్తుతం 'ద గ్రేట్ ఇండియా క్యాసీనో'.. దేశీ మ్యాజిక్ చిత్రాల్లో నటిస్తోందని కథనాలొచ్చాయి. బ్లాక్ బస్టర్ గద్దర్ సీక్వెల్లోనూ తన పాత్రకు కొనసాగింపు అవకాశం దక్కించుకుంది. మిస్టరీ ఆఫ్ టాటూ అనే చిత్రంలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది.
ఇంతకుముందు 'బద్రి' సినిమాతో ఆమె తెలుగులో అడుగు పెట్టిన ఆ తర్వాత మహేష్ సరసన 'నాని' లో నటించింది. కానీ సక్సెస్ లేక టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అమీషా పటేల్ తొలి నుంచి బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడ కూడా కెరీర్ పరంగా ఆశించిన స్టార్ డమ్ అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం పంజాబీ చిత్రాల్లోనూ నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.