వీళ్ల లవ్ గేమ్ తేడా కొడుతోందిగా!

Sat Jul 20 2019 07:00:02 GMT+0530 (IST)

ఒక అమ్మాయి అబ్బాయి కలిసి డిన్నర్ లు చేయడం.. వీలున్న ప్రతిసారీ కలిసి లంచ్ లు బ్రంచ్ లు అంటూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేయడం...రెస్టారెంట్లు... థియేటర్లకు వెళ్లడం.. కార్నర్ సీట్లో కూచుని కబుర్లు చెప్పుకోవడం.. ఇవన్నీ దేనికి సింబాలిక్?సరే అదంతా కేవలం స్నేహం అని అనుకుంటే .. ప్రతిరోజూ ఇదే సన్నివేశం రిపీటైతే.. కలిసి షికార్లు చేస్తూ .. గంటల తరబడి ఒకరినొకరు విడిచి ఉండలేకపోతే దానిని ఏమని అనాలి?  ప్రేమ అని అనకూడదా? ఇలాంటి సందిగ్ధావస్త గురించి సదరు కుర్రహీరో బయటపడలేకపోతున్నాడు. ఇద్దరి మధ్య అనుబంధానికి సంబంధించి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకూడదని అంటున్నాడు. ఆ ఇద్దరికీ కొంత సమయాన్ని ఇవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అనుబంధం పెంచుకోవడానికి కొంత సమయం కావాలి. భాగస్వామితో రిలేషన్ షిప్ ఉన్నప్పుడు మంచి జ్ఞాపకాల్ని పదిల పరుచుకోవాలి. అనుబంధానికి టైమ్ ని కేటాయించడమే పెట్టుబడి లాంటిది. ఎక్కువ కాలం కలిసి ఉంటామని సైకలాజికల్ గా సెక్యూరిటీ వచ్చే వరకూ ఆ బంధాన్నిఓకే అని అనకూడదు... అని క్లాస్ తీస్కున్నాడు. ఈరోజుల్లో చాలా మంది యాక్టర్లు స్వార్థంతోనే ఉంటున్నారు. వాళ్లు చెప్పేది వినాలి కానీ.. మనం చెప్పేది వినడం లేదు. అవతలి వాళ్లు ఏం చెబుతున్నారో ఈరోజుల్లో ఎవరూ వినడం లేదు.. అని సుశాంత్ ఇటీవల ఓ సందర్భంలో అన్నాడు. అంటే తన లవ్ ని తానే కన్ఫామ్ చేసేవరకూ ఏదీ నమ్మొద్దన్నది అతడి వెర్షన్.

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తర్వాత లవర్ బోయ్ గా సుశాంత్ సింగ్ పేరు మార్మోగుతోంది. ఇప్పటికే కృతి సనోన్.. సారా అలీఖాన్ లతో ప్రేమలో పడ్డాడని వార్తలొచ్చాయి. అయితే వాళ్లతో బ్రేకప్ అయ్యాక.. ప్రస్తుతం రియా చక్రవర్తితో  చెట్టా పట్టాల్ అంటూ తిరిగేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్యా అనుబంధాన్ని మాత్రం కన్ ఫామ్ చేయడం లేదు. ఇది కేవలం స్నేహం మాత్రమేనంటూ తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే బర్త్ డే ల వేళ ఖరీదైన కానుకలు ఇస్తూ ఒకరిపై ఒకరు ప్రేమను రివీల్ చేసిన సందర్భాలున్నాయి. ఇటీవలే రియాకపూర్ బర్త్ డే సందర్భంగా ఓ ఖరీదైన పెండెంట్ ని సుశాంత్ కానుకిచ్చాడు. లడక్ లో ఈ జంట షికార్లు ప్రముఖంగా వార్తల్లోకొచ్చాయి. అందుకే వీళ్ల వ్యవహారం ఏదో తేడా కొడుతోంది! అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. తాజాగా మరోసారి షికార్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. ఏంటో అంతా తేడా తేడాగానే ఉంది వ్యవహారం.