కహోనా ప్యార్ హై డేస్ తిరిగి తేవడం కష్టం

Thu Jul 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Ameesha patel latest photo

హాఫ్ సెంచరీ ఏజ్ కి చేరువలో ఉంది అమీషా పటేల్. కానీ ఇంకా `కహోనా ప్యార్ హై డేస్`ని తిరిగి తేవాలని తపన పడుతోంది. ఇంకా అదే ఎనర్జీ.. అవే హొయలు.. అదే స్పీడ్.. కానీ ఏం లాభం.. ఏజ్ సహకరించాలి కదా!  గత కొంతకాలంగా తనను తాను టూమచ్ హాట్ గా ప్రదర్శిస్తూ ఇన్ స్టా సహా ఇతర సోషల్ మీడియా మాధ్యమంలో ఫాలోయింగ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఈ భామకు అనుచరగణం అంతంత మాత్రమే. ప్రతిసారీ వేడెక్కించే ఫోటోలను వీడియోలను షేర్ చేస్తున్నా వాటిలో అమీషా ఏజ్ స్పష్టంగా బయటపడిపోతుండడమే ఇందుకు కారణం.తాజాగా బ్లాక్ బికినీలో అగ్గి రాజేసే ప్రయత్నం చేసింది. బుధవారం నాడు అమీషా తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ బికినీ లుక్ ని షేర్ చేసింది. వేసవి సమయం.. ఈతకు వెళ్లే సమయం అంటూ ఇంతకుముందు కూడా ఇలానే బికినీ వీడియోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి బ్లాక్ బికినీలో చెలరేగిపోయింది.

అయితే ఈ ఫోటో చూడగానే  నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్ ను నింపారు. లుకింగ్ గార్జియస్ అని రాశారు. మరొక వ్యక్తి `ఎప్పటిలాగే హాట్` అని వ్యాఖ్యానించారు. అయితే కొందరు మాత్రం ఏజ్ తెలిసిపోతోందిగా అంటూ కామెంట్ చేసారు.

నిజానికి ఈ రేంజులో చెలరేగడం అమీషాకు ఇదే మొదటిసారి కాదు. నిరంతరం వేడెక్కించే అవతారాల్ని  సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఇటీవల 47 ఏళ్ల ఈ బ్యూటీ తన గ్లామరస్ లుక్స్ ని ప్రదర్శిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యింది. గోవా ఫ్యాషనిస్టా.. అమీషా తదితర హ్యాష్ ట్యాగులతో ఈ ఫోటో వైరల్ గా మారుతోంది. ఇంతలోనే మరోసారి బికినీతో హీట్ పెంచింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అమీషా 2000లో హృతిక్ రోషన్ సరసన కహో నా ప్యార్ హైతో తెరంగేట్రం చేసింది. టాలీవుడ్ లో బద్రి- నాని సహా పలు టాప్ సినిమాల్లో నటించింది. అలాగే హిందీలో తోడా ప్యార్ తోడా మ్యాజిక్- మంగళ్ పాండే - హమ్కో తుమ్సే ప్యార్ హై వంటి భారీ చిత్రాలలో కూడా నటించింది.

ఆమె చివరిసారిగా 2018లో `భయాజీ సూపర్ హిట్` లో కనిపించింది. అమీషా తన బ్లాక్ బస్టర్ మూవీ `గదర్- ఏక్ ప్రేమ్ కథ` చిత్రానికి సీక్వెల్ అయిన `గదర్ 2`లో కనిపించనుంది. అమీషా - సన్నీ డియోల్ `గదర్ 2` లో వారి పాత్రలను తిరిగి పోషించనున్నారు.