ప్రభాస్ చేతిలో అద్భుత ప్రాజెక్ట్

Sat Oct 23 2021 22:00:01 GMT+0530 (IST)

Amazing project in the hands of Prabhas

ప్రభాస్ టాలీవుడ్ లో టాల్ హీరో అయిపోయారు. ఆయన ఈశ్వర్ మూవీ ద్వారా వెండి తెర మీద ఎంట్రీ ఇచ్చినపుడు క్రిష్ణం రాజు తమ్ముడు కొడుకు అనే అన్నారు. ఆ తరువాత వర్షం మూవీ వచ్చేసరికి మాత్రం కుర్రోడిలో స్టామినా చాలానే ఉందని నమ్మారు. ఇక చత్రపతి మూవీతో సూపర్ స్టార్ డమ్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన వేళ ఈయన న్యూ జనరేషన్ హీరో అనేశారు. మొత్తానికి ప్రభాస్ ప్రస్థానం నెమ్మదిగా మొదలై ఈ రోజున బాలీవుడ్ దాటి హాలీవుడ్ వైపుగా సాగుతోంది. రాజమౌళి బాహుబలి కోసం అయిదేళ్లు విలువైన టైమ్ ని ప్రభాస్ కేటాయిస్తే తెలిసే చేస్తున్నాడా అన్న వారూ ఉన్నారు. అయితే రాజమౌళిని నమ్మిన ప్రభాస్ కష్టం ఊరకే పోలేదు. ఆ దెబ్బతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.ఇపుడు బాలీవుడ్ మేకర్స్ ప్రభాస్ తో మూవీస్ చేస్తున్నారు అంటే నాటి కష్టం ఫలితమే అని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ కాల్షీట్లు చూస్తే మతి పోవాల్సిందే. ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు చేస్తున్న సినిమాలు తీస్తున్న బ్యానర్లు చూస్తే బాలీవుడ్ లోనే ఎవరికీ అందనంత ఎత్తున ఉన్నాడనే చెప్పాలి. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సలార్ రాధేశ్యాం మూవీస్ వేటికవే సెపరేట్ గా ఉంటాయి. అవన్నీ డిఫరెంట్ జానర్లలో వస్తున్నాయి.

వీటికి ఏ మాత్రం పోలిక లేని విధంగా వస్తున్న మూవీయే వైజయంతి మూవీస్ వారి యాభయ్యవ సినిమా. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న మూవీ సరికొత్త సంచలనాలే నమోదు చేస్తుంది అంటున్నారు. ఈ మూవీలో ఏమి ఉన్నాయి అనే కంటే ఏమి లేవు అని ఆలోచించడమే బెటర్ అంటున్నారు. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ అని సైన్స్ ఫిక్షన్ అని వినిపిస్తున్న ఈ మూవీని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఇప్పటికే కొంత షూట్ చేశారు. నవంబర్ లో ఈ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతోందిట.

ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా రెండు వందల రోజుల పాటు కాల్షీట్లు ఇచ్చాడూ అంటే ఈ మూవీ మీద అంచనాలు ఒక రేంజిలో ఉండాల్సిందే అంటున్నారు. ఈ మూవీలో కాస్టింగ్ కూడా అదిరిపోయేలలా ఉంది. దీపికా పదుకొణే. అమితాబ్ బచ్చన్ వంటి ఉద్ధండులు ఈ మూవీలో కనిపించనున్నారు. మొత్తానికి ఎపుడు రిలీజ్ అయినా కానీ వైజయంతి వారి మూవీ మాత్రం భారతీయ సినీ రంగాన సరికొత్త రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అంటున్నారు. సో ప్రభాస్ మరో లెవెల్ ని కూడా ఈ మూవీ చూపిస్తుందిట. డార్లింగ్ అభిమానులూ అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే మరి.