హాలీవుడ్ నటి అమండా బైన్స్ తన జీవితంలో అత్యంత భయంకరమైన దశను ఎదుర్కొంటోంది. ఆమెకు మతి భ్రమించి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ స్థానికుల కంట పడింది. కాలిఫోర్నియా స్థానికురాలు ఒకరు ఇటీవల సదరు నటిని మానసిక వైద్యుని వద్దకు చేర్చారు. ప్రత్యక్ష సాక్షి వివరాల ప్రకారం.. బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న అమండా తన కారును కిందకి పైకి ఊపుతూ తాను మనోవిక్షేప ఎపిసోడ్ లో వెళుతున్నట్లు తన డ్రైవర్ కు చెప్పింది.
అంతేకాదు డౌన్ టౌన్ LA సమీపంలోని వీధి మధ్యలో నగ్నంగా చిందులు వేసింది. ఆ తర్వాత తనని అదుపు చేసేందుకు సహాయం కోసం 911కి డయల్ చేసారు. 36 ఏళ్ల అమండా వింత వైఖరి అందరినీ భయపెట్టింది. దీంతో సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. చివరికి ఆమెను 5150 హోల్డ్ అనే మనోరోగచికిత్స ఆస్పత్రిలో చేర్చారు. తాజా నివేదిక ప్రకారం అమండా కొంతకాలంగా మందులు తీసుకోకపోవడంతో రోగం ముదిరిందని తెలుస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వివరాల ప్రకారం.. అమండా బైన్స్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. చాలా రోజుల పాటు తనకు చికిత్సను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. వైద్యుల పర్యవేక్షణ పరీక్ష సమయంలో అమండా ఏ విధంగాను గాయపడలేదని కూడా తేలింది.
అమండా తిరుగాడే ప్రాంతాన్ని బట్టి తన పరిస్థితి చాలా దారుణంగా మారిందని కూడా చెబుతున్నారు. మానసిక చికిత్స సాధారణంగా 72 గంటల పాటు కొనసాగుతుంది. అయితే పరిస్థితిని బట్టి చికిత్సను పొడిగించే అవకాశం ఉంది.
అమండా గురించి ఇంకా చాలా నిజాలు ఈ సందర్భంగా బయటపడ్డాయి. సదరు నటీమణి ఇటీవల తన కుటుంబంతో టచ్ లో లేదని తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంపై మాజీ భర్త పాల్ మైఖేల్ మాట్లాడుతూ.. అమండా ఇటీవల వైద్యులు సూచించిన మందులను వేసుకోవడం నిలిపివేసిందని దాంతో క్రూరంగా మారిందని చెప్పారు.
ఈ జంట చివరిగా డిసెంబర్ 2022లో జంటగా కెమెరాలకు కనిపించారు. అటుపై అమండాకు అతడు దూరమయ్యాడు. 2013లో అమండా బైన్స్ కు మానసిక ఆరోగ్యంతో సమస్యలు రావడంతో అమండా తల్లి కన్జర్వేటర్ షిప్ ను చేపట్టారు. అదే సమయంలో ఆమెకు బైపోలార్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అమాండా మనోరోగచికిత్స ఎపిసోడ్ నాటికి కన్జర్వేటర్ షిప్ రద్దు అయి సుమారు ఏడాది అవుతోందని తెలుస్తోంది. మరో కథనం ప్రకారం.. అమండా తన మాజీ 'ఆల్ దట్' సహనటులతో కలిసి కనెక్టికట్ లోని నైన్ టీస్ కాన్ ఫెస్టివల్ కు హాజరు కావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఆ ప్రణాళికను వాయిదా వేసారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.