Begin typing your search above and press return to search.

'యమ్మీ కేక్' అంటూ వైరల్ అవుతున్న మెగా హీరోల భామ!!

By:  Tupaki Desk   |   5 Aug 2020 12:30 AM GMT
యమ్మీ కేక్ అంటూ వైరల్ అవుతున్న మెగా హీరోల భామ!!
X
తెలుగు చిత్ర పరిశ్రమలోకి తమిళ అనువాద చిత్రం 'ప్రేమఖైది'తో అడుగుపెట్టిన కేరళ భామ అమలాపాల్. అయితే ఆర్జీవీ రూపొందించిన 'బెజవాడ' సినిమాతో డైరెక్ట్ తెలుగు హీరోయినుగా పరిచయమైంది. ఇప్పటి వరకు ఈ భామ తమిళంలో ఎక్కువ సినిమాలు చేసి తెలుగులో తక్కువగా చేసింది. అమలాపాల్ తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే కానీ తన అందాలతో.. నటనతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మెగా హీరోలు రాంచరణ్, బన్నీలతో నటించి తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోలతో నటించినా కూడా ఈ భామ ఇండస్ట్రీలో నిలబడలేక పోయింది. టాలీవుడ్ మేకర్స్ కూడా అమల వైపు చూడట్లేదు. ఇక కెరీర్ ముగిసిందని అనుకుంటున్న టైంలో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌పై ఫోకస్ పెట్టింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ సినీ డైరెక్టర్ విజయ్ ని పెళ్ళాడి తక్కువ కాలంలోనే విడాకులు తీసుకుంది.

ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని విఐపి2, ఆమె సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ప్రస్తుతం అమలాపాల్ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే దృష్టి పెడుతున్నారు. దాంతో హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో అమలాపాల్ నటిస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో కేక్ కట్ చేస్తున్న పిక్ పోస్ట్ చేసింది. ఇటీవలే ఓ మ్యాగజైన్ పిక్ పోస్ట్ చేసింది. మ్యాగజైన్ ప్రారంభించి నేటితో ఒక సంవత్సరం పూర్తి కావడంతో అమలాపాల్ ఈ పోస్ట్ చేసింది. ఇక మొత్తానికి బాలీవుడ్‌లో నటించాలన్న తన కల తీరుతున్నందుకు అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట. ఇక కేక్ కట్ చేసి తింటున్న పిక్ చూసి ఫ్యాన్స్ లైక్స్ షేర్స్ లక్షలలో కొడుతున్నారు. కంప్లీట్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఈ భామ యమ్మీ టేస్ట్ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.