'జెర్సీ' రీమేక్ లో 'ఆమె' ప్రతాపం

Wed Aug 14 2019 09:32:02 GMT+0530 (IST)

Amala Paul signs Jersey Tamil remake

కెరీర్ తొలి నుంచి ప్రయోగాల బాటలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది అమలాపాల్. బోల్డ్ క్యారెక్టర్లు చేయడం తనకు కొత్తేమీ కాదు. ప్రేమ ఖైదీ సినిమా విడుదలకు ముందు అమలా నటించిన కొన్ని సినిమాలు బోల్డ్ కంటెంట్ వల్ల వివాదాస్పదం అయ్యాయి. అయితే కాలక్రమంలో స్టార్ హీరోయిన్ అయ్యాక మాత్రం ఆ వివాదాల నుంచి బయటపడింది. నాన్న లాంటి క్లాసిక్ సినిమాలో అమలా నటించి మెప్పించింది. తెలుగులోనూ చరణ్ బన్ని లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.అమలా కథల ఎంపికలో ఏమాత్రం రాజీకి రాదని ఇటీవలే రిలీజైన `ఆమె` చిత్రం ప్రూవ్ చేసింది. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఎలాంటి స్క్రిప్టును ఎంచుకుంటోంది? అంటే .. ఈసారి మాత్రం కాస్తంత డీఎంట్ రోల్ నే ఎంపిక చేసుకుంది. నాని- శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన `జెర్సీ` తమిళ రీమేక్ లో అమలా కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఆ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రలో అమలా నటించనుంది.

జెర్సీ తమిళ రీమేక్ ని హీరో రానా నిర్మిస్తున్నారు. విష్ణు విశాల్ కథానాయకుడు. దర్శకుడు ఎవరు అన్నదానిపై రకరకాలుగా ప్రచారం సాగినా ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. విష్ణు విశాల్- అమలాపాల్ జోడీ ఇదివరకూ రచ్చాసన్ (రాక్షసుడు) చిత్రంలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. జెర్సీ హిందీ రీమేక్‌ని  దిల్ రాజుతో కలిసి మాతృక  నిర్మాత నాగవంశీ నిర్మించనున్నారు. అక్కడ కాస్ట్ అండ్ క్రూ ఎంపికలు సాగాల్సి ఉంది.