Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: అచుకు బుచుకు భామ

By:  Tupaki Desk   |   12 Dec 2019 12:25 PM GMT
ఫోటో స్టోరీ: అచుకు బుచుకు భామ
X
అమల పాల్ పేరు తెలియని ప్రేక్షకులు దక్షిణాదిలో తక్కువ మందే ఉంటారు. దాదాపు అన్ని సౌత్ భాషల్లో నటించిన ఈ భామ ఎన్నో వివాదాలతో కూడా తరచూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. 'ఆడై' సినిమాలో ఒక సీన్ లో నగ్నంగా నటించి అందరికీ టోకుగా షాక్ ఇచ్చిన ఈ భామకు రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన అవార్డుల ఈవెంట్ లో 'రైజింగ్ సెన్సేషన్' అనే అవార్డు సాధించింది.

ఈ అవార్డుల ఫంక్షన్ కు ఏదో ఒక డ్రెస్ వేసుకుని వెళ్తే ఎలా? అందుకే చక్కగా తయారైంది. స్లీవ్ లెస్ డిజైన్ లో డీప్ వీనెక్ ఉండే ఒక అందమైన స్టైలిష్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ లోనే ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. బ్రౌన్ కలర్ లిప్ స్టిక్.. ఇయర్ రింగ్స్.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఒక అందమైన శిల్పం లాగా నిలుచుంది. డ్రెస్ చూసేందుకు సింపుల్ గా ఉన్నప్పటికీ అమల మాత్రం ఎంతో గ్రేస్ ఫుల్ గా నిలుచుంది.

ఈ ఫోటోలకు నెటిజన్లు మంచి కామెంట్లు పెట్టారు. "నీకు పోటీనే లేదు అమలా".. "అచుకు బుచుకు భామ".. "గ్లామరస్ డెవిల్" అంటూ కొందరు స్పందించారు. అయితే ఆ రెండో కామెంట్లో అచుకు బుచుకు ఏంటో అర్థం కాకుండా ఉంది! ఇక అమల సినిమాల విషయానికి వస్తే 'అదో అంద పారవై పోల'.. 'ఆడుజీవితం'.. 'కెడవర్' లో నటిస్తోంది. ఇవి కాకుండా తెలుగు 'లస్ట్ స్టోరీస్' ను కూడా ఒక చూపు చూస్తోంది.