మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. ఇప్పుడు వారికి ఎన్నో అవకాశాలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు అక్కినేని అమల. ఏసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు అక్కినేని అమల. ఈ సందర్భంగా అమల మహిళలు.. వారు రాణిస్తున్న విషయాల గురించి ప్రస్థావించారు. ఈ క్రమంలో తను సినిమాల్లోకి ఎలా వచ్చానో కూడా ఆడియన్స్ తో పంచుకున్నారు. తానొక క్లాసికల్ డాన్సర్ అవడం వల్ల సినిమాల్లో క్లాసికల్ డాన్స్ వచ్చిన హీరోయిన్ పాత్రల కోసం తనని సంప్రదించారని అన్నారు. అది అంత సులువైన విషయం కాదని అన్నారు అక్కినేని అమల.
అంతేకాదు మనకు వచ్చిన పాత్ర మనకు ఫిట్ అవ్వాలి.. ఒకవేళ ఆ పాత్రకు మనం ఫిట్ కాకపోతే మూస పద్ధతిలో సినిమాలు చేస్తూ వెళ్లాల్సి వస్తుందని అన్నారు అక్కినేని అమల. అయితే ప్రస్తుతం అవకాశాలు ఎక్కువవడం వల్ల తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు రకరకాల ఫ్లాట్ ఫాం లు ఉన్నాయని అన్నారు అమల. యంగ్ ఫిల్మ్ మేకర్స్ ముఖ్యంగా మహిళలు కూడా సినిమాలు తీస్తున్నారు. ఏ పరిశ్రమలో అయినా పురుషాధిక్యం ఉంటుంది. సినీ పరిశ్రమలో కూడా అది కనబడుతుంది.
అయినా సరే తమకు వచ్చిన పాత్రలు ప్రేమించి.. నటనని మెరుగు పరుచుకుని కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాల్సి ఉంటుంది. అది అంత సులువైన విషయం కాకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు అక్కినేని అమల.
హీరోయిన్ గానే కాదు అక్కినేని ఫ్యామిలీ సభ్యురాలిగా కూడా అమల ఇచ్చిన సలహా నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అని చెప్పొచ్చు.
అవకాశం రావడమే ఎక్కువ అనుకుంటే అలా ఉండిపోతారు.. కానీ వచ్చిన ఛాన్స్ ని తమకు మరో ఛాన్స్ వచ్చేలా కష్టపడితే పరిశ్రమలో కొన్నాళ్లు ఉండగలుగుతారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసినా సరే తమని తాము ప్రూవ్ చేసుకోవాలనే అమల చెబుతున్నారు.
అందుకు తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని ఆమె అన్నారు. ఈ ఈవెంట్ లో అమల స్పీచ్ ఔత్సాహిక కళాకారులకు మంచి గీతోపదేశమని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.