దళపతితో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో

Fri May 07 2021 22:00:01 GMT+0530 (IST)

Almost in the final stage with the team

తమిళ స్టార్ హీరో .. ఇళయ థలపతి విజయ్ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఫిక్సయినట్టేనా?   వంశీ పైడిపల్లితో కథా చర్చలు ఎంతవరకూ వచ్చినట్టు?  మాస్టర్ మైండ్ దిల్ రాజు గాలానికి విజయ్ చిక్కాడా? ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానం..  ఔనని కానీ లేదు అని కానీ రాలేదు.ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. విజయ్ కి పైడిపల్లి కథ.. దిల్ రాజు ప్యాకేజీ ఆల్మోస్ట్ నచ్చినట్టేనని టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పైడిపల్లికి జాక్ పాట్ తగిలినట్టే.

విజయ్ తమిళంలో పెద్ద మాస్ స్టార్. రజనీ తర్వాత మళ్లీ ఆ రేంజులోనే వసూళ్లు తేగలిగిన స్టార్. ఇటు తెలుగులోనూ అంతకంతకు ఇమేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు దర్శకుడు.. తెలుగు నిర్మాతతో స్ట్రెయిట్ గా ఇక్కడ అడుగు పెట్టేందుకు వీలుంటుంది. ఇలాంటి అవకాశం కోసమే పైడిపల్లికి అతడు లాకై ఉంటాడని భావిస్తున్నారు. అయితే దర్శకనిర్మాతలు దీనిని అధికారికంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో దళపతి 65 చిత్రీకరణలో ఉన్నారు.