Begin typing your search above and press return to search.

ధాస్ కీ ధ‌మ్కీ : ఆల్ మోస్ట్ ప‌డిపోయిందే పిల్లా!

By:  Tupaki Desk   |   6 Dec 2022 11:57 AM GMT
ధాస్ కీ ధ‌మ్కీ : ఆల్ మోస్ట్ ప‌డిపోయిందే పిల్లా!
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దాస్ కీ ధ‌మ్కీ'. తెలుగుతో పాటు ఈ మూవీని త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని రీసెంట్ గా సీనియ‌ర్ స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ విడుద‌ల చేసిన విష‌యం తెల‌సిందే. మాస్ కా దాస్ గా విశ్వ‌క్ సేన్ చేసిన హంగామా, ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ అందించిన స్టోరీ, డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి.

ట్రైల‌ర్ రిలీజ్ కు భారీ క్రేజ్ రావ‌డంతో ఈ మూవీ రిలీజ్ ని హీరో విశ్వ‌క్ సేన్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని కూడా మొద‌లు పెట్టాడు. ఇందులో భాగంగా 'ఆల్ మోస్ట్ ప‌డిపోయిందే పిల్లా..'అంటూ సాగే ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ వీడియోని తెలుగు, హిందీ భాష‌ల్లో మంగ‌ళ‌వారం హీరో రానా ద‌గ్గుబాటి, సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ విడుద‌ల చేశారు. తెలుగు వెర్ష‌న్ 'ఆల్ మోస్ట్ ప‌డిపోయిందే పిల్లా..' అంటూ సాగితే హిందీ వెర్ష‌న్ 'ఆల్ మోస్ట్ దిల్ కా ప‌తా మిలా..' అంటూ సాగ‌నుంది.

లియోన్ జేమ్స్ సంగీతం అందించ‌గా పూర్ణా చారి సాహిత్యం అందించాడు. ఆదిత్య ఆర్ కె, లియోన్ జేమ్స్ ఆల‌పించారు. య‌ష్ మాస్ట‌ర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. అంద‌మైన బీచ్ లొకేష‌న్ ల‌లో ఈ పాట‌ని హీరో విశ్వ‌క్ సేన్‌, హీరోయిన్ నివేదా పేతురాజ్ ల‌పై చిత్రీక‌రించారు. ఈ పాట సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది. క్యాచీ ప‌దాల‌తో సాగే ఈ పాట ఖ‌చ్చితంగా ఆడియ‌న్స్ చేత కూడా హ‌మ్ చేయించేలా వుంది.

ఇక య‌ష్ మాస్ట‌ర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ పాట‌లో నివేదా పేతురాజ్ గ్లామ‌ర్‌, మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ మాస్ స్టెప్పులు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌నున్నాయి. నివేదా గ‌త చిత్రాల‌కు మించి ఈ మూవీగా మ‌రింత గ్లామ‌ర్ గా అందాల విందుకు సై అన్న‌ట్టుగా తెలుస్తోంది.

త‌న గ్లామ‌ర్ తో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం ఖాయం అని చెబుతున్నారు. ఇక హిందీలో ఈ పాట‌కు అమితాబ్ వ‌ర్మ సాహిత్యం అందించ‌గా న‌కాష్ అజీజ్ తో క‌లిసి లియోన్ జేమ్స్ ఆల‌పించాడు. హిందీలోనూ ఈ పాట దుమ్మురేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

విశ్వ‌క్ సేన్ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించారు. విశ్వ‌క్ సేన్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ సినిమాని 2023 ఫిబ్ర‌వ‌రి 17న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయికి ఓ డ‌బ్బున్న అమ్మాయికి మ‌ధ్య సాగు రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీకి దినేష్ కె బాబు సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండ‌గా అన్వ‌ర్ అలీ ఎడిటింగ్ స‌మ‌కూరుస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.