Begin typing your search above and press return to search.

అల్లు మీటింగ్ క్యాన్సిల్.. అసలేంటి గొడవ

By:  Tupaki Desk   |   6 Feb 2023 7:47 PM GMT
అల్లు మీటింగ్ క్యాన్సిల్.. అసలేంటి గొడవ
X
గత కొద్ది కాలంగా టాలీవుడ్ లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర సినిమా ఏదో ఒక విషయంతో తెరపైకి వస్తూ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారుతోంది. అయితే తాజాగా మళ్లీ టాలీవుడ్ లో వాడివేడిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు ఉదయాన్నే అల్లు అరవింద్ నుంచి మీడియాకు ప్రెస్ మీట్ కు రమ్మని ఆహ్వానం అందడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. ఏమై ఉంటుందా అని తెగ ఆసక్తిగా ఎదురు చూశారు. ముందు బాలయ్య నర్సుల కామెంట్ వివాదమేమో అని భావించారు. తీరా చూస్తే అది కాదని తెలిసింది.

నిన్న దర్శకుడు పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబోలో దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది గీతగోవిందం సీక్వెల్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో గీతగోవిందం చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ దిల్ రాజు నిర్మించడం పై .. అల్లు అరవింద్ కీలక కామెంట్ చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.

ప్రస్తుతం ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారని, ఎన్నో విషయాలపై కుండ బద్దలు కొట్టబోతున్నారని అంతా అనుకున్నారు. కానీ మళ్ళీ అంతలోనే.. అల్లు అరవింద్ నుంచి.. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అంటూ సందేశం రావడం మరో షాక్ కు గురి చేసింది.

అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో టీ కప్పులో తుఫాను లాగ ఇప్పుడీ కాంట్రావర్సీ తలెత్తితే దాని వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ విన్నపం చేయడం వల్లే అరవింద్ వెనక్కు తగ్గారనే మాట వినిపిస్తోంది. గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో అరవింద్ ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారట. కానీ కమిట్మెంట్ను పక్కన పెట్టేసి దిల్ రాజుకి కమిట్ కావడం ఇప్పుడీ వివాదానికి దారి తీసిందని వినికిడి.

సాధ్యమైనంత వివాదాలకు దూరంగా ఉంటారని పేరున్న అల్లు అరవింద్ దర్శకుడి ప్రవర్తన వల్లే సహనం కోల్పోయారనే విషయం కూడా వినిపిస్తోంది. గతంలో పివిపికి వంశీ పైడిపల్లికి ఏదైతే వివాదం జరిగిందో అచ్చంగా అదే ఇప్పుడూ రిపీట్ అయ్యిందని ఫిలిం నగర్ సమాచారం. తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టు తీసుకోవడం ఏమిటనేది గీతా ఆర్ట్స్ వర్గాల వాదన. అయితే ఇక్కడ స్పష్టత కొరవడుతోంది. ఏది అధికారికంగా బయటికి రావడం లేదు. అంతా లోలోపలే మాట్లాడుకుంటున్నారు.

ఏదేమైనప్పటికీ అసలేం జరిగిందో తెలియాలంటే అల్లు అరవింద్, దిల్ రాజు,పరశురామ్, విజయ్ దేవరకొండ స్పందించాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.