Begin typing your search above and press return to search.

'ప్రేమకాదంట' డబ్బింగ్ స్టార్ట్ చేసిన అల్లు శిరీష్..!

By:  Tupaki Desk   |   30 July 2021 7:58 AM GMT
ప్రేమకాదంట డబ్బింగ్ స్టార్ట్ చేసిన అల్లు శిరీష్..!
X
'ఎబిసిడి' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని యువ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న సినిమా ''ప్రేమకాదంట''. ఇందులో గార్జియస్ మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 'విజేత' 'జత కలిసే' ఫేమ్ రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఏకకాలంలో జరుపుతున్నారు.

తాజాగా హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా ''ప్రేమ కాదంట'' సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డబ్బింగ్ స్టూడియోలోని ఓ ఫోటోని షేర్ చేశారు శిరీష్. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ని ఇటీవలే తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక షెడ్యూల్ మినహా చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై 'ప్రేమకాదంట' సినిమా రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబు - ధీర‌జ్ మోగిలినేని సహ నిర్మాతలు‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ - అచ్చు రాజ‌మ‌ణి సంగీతం సమకూరుస్తున్నారు. త‌న్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక్ శ్రీనివాస్.ఆర్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వినూత్న‌మైన క‌థ‌లతో ఎంట‌ర్టైన్ చేస్తూ వస్తున్న అల్లు శిరీష్ కు 'ప్రేమకాదంట' చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.