Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమా అప్డేట్..!

By:  Tupaki Desk   |   29 May 2023 8:52 PM GMT
అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమా అప్డేట్..!
X
ఓ పక్క అన్న అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకెళ్తున్నాడు. పుష్ప తర్వాత తన రేంజ్ మారిపోయిందని అందరికీ తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన నార్త్ ఆడియన్స్ కి మాంచి కిక్ ఇచ్చింది. అందుకే ఆ సినిమాను అక్కడ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. అన్న ఆ రేంజ్ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తుండగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. పదేళ్ల కెరీర్ లో 7 సినిమాల దాకా తీసినా సరే అల్లు శిరీష్ ఇప్పటివరకు సరైన హిట్ కొట్టలేదని చెప్పొచ్చు.

లాస్ట్ ఇయర్ వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా కూడా నిరాశపరచింది. ఊర్వశివో రాక్షసివో సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ తన నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాడా అన్న అప్డేట్ ఇన్నాళ్లు ఇవ్వలేదు. ఫైనల్ గా ఈరోజు తన సినిమా అప్డేట్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు అల్లు శిరీష్. తన కో స్టార్ టెడ్డీ బేర్ తో మెట్రో ట్రైన్ లో ఉన్న ఒక పోస్టర్ ని షేర్ చేస్తూ తన నెక్స్ట్ సినిమా గురించి హింట్ ఇచ్చాడు అల్లు శిరీష్.

ఇక ఈ సినిమా గురించి డీటైల్స్ మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు చెబుతామని అంటున్నారు. మొత్తానికి అల్లు శిరీష్ మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు అల్లు శిరీష్ మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే సినిమా అయినా అతనికి మంచి ఇస్తుందా లేదా అని అప్పుడే డిస్కషన్స్ మొదలు పెట్టారు. అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరు. శిరీష్ ఏ జోనర్ సినిమాతో వస్తున్నాడు లాంటి విషయాలపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

గౌరవం సినిమా నుంచి చూస్తే అల్లు శిరీష్ నటుడిగా తన ప్రతిభ చాటాలని ప్రయత్నిస్తున్నా కథల ఎంపిక వల్లో మరో కారణమో కానీ కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. అందుకే సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటున్నాడు అల్లు శిరీష్. అల్లు అరవింద్ దృష్టి పెడితే స్టార్ డైరెక్టర్ తో అల్లు శిరీష్ సినిమా చేయించడం పెద్ద విషయం కాదు కానీ అల్లు శిరీష్ తన సొంత టాలెంట్ తో మెప్పించాలని చూస్తున్నాడు. అల్లు శిరీష్ కి ఈ సినిమా నుంచి అయినా బ్యాడ్ టైం పోయి గుడ్ లక్ మొదలవుతుందేమో చూడాలి.