అల్లు - దిల్ వార్.. అంతా ఎలక్షన్స్ కోసమేనా

Tue Feb 07 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

Allu - Dil War.. Everything is for Elections

టాలీవుడ్ లో రెండు రోజుల నుంచి వాతావరణం అస్సలు బాగోలేదు.  మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వాడివేడిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మీడియాలో వీరిద్దరే హాట్టాపిక్. టాలీవుడ్లో బాగా రాణిస్తున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ల మధ్య వివాదం ఏర్పడినట్లు... అది ముదురుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల మండలి ఎలక్షన్స్ (ఫిబ్రవరి 18) దగ్గర పడే సమయంలో ఇలా జరగడం కలకలం రేపుతోంది.ఈ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయి ఉండాలి. మరి జరిగిందో లేదో తెలీదు.  ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి ప్రొడ్యూసర్ గిల్డ్ ఎంట్రీ ఇచ్చి..  వీరిద్దరి మధ్య గొడవను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఎలక్షన్స్ దగ్గర పడేసరికి ఈ స్టార్ ప్రొడ్యూసర్ల  మధ్య సినిమా విషయంలో వివాదం రావడం ఇప్పుడు వీరద్దరు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.

అసలు వివాదం ఎలా మొదలైందంటే...  రెండు రోజుల క్రితం దర్శకుడు పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబోలో దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది గీత గోవిందం సీక్వెల్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో గీతా గోవిందం చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించిన సంగతి తెలిసిందే.  ఆ సమయంలో విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో గీతా గోవిందం 2 కూడా తీయాలని అరవింద్ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నారని వినిపిస్తోంది. అయితే దాన్నిపక్కన పెట్టి.. కొత్తగా దిల్ రాజుతో పరశురామ్ మూవీ అనౌన్స్ చేయడం వల్లే ఇప్పుడీ వివాదం చోటుచేసుకుందని వినికిడి.

ప్రస్తుతం అల్లు అరవింద్ బాగా ఆగ్రహంగా ఉన్నారని.. అందుకే నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారని తెలుస్తోంది. అంతలోనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ రిక్వెస్ట్ చేయడంతో అరవింద్ మీట్ క్యాన్సల్ చేశారని మరో టాక్ వినిపించింది. ఇక ఈ వార్ ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడాలి. ఇద్దరూ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్లే కావడంతో... వార్ ఎటు వెళ్తుందో ఇక.!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.