వామ్మోవ్! సైలెంట్ గా షారూక్ డైరెక్టర్ ని క్యాచ్ చేసిన బన్నీ!

Thu Jan 27 2022 05:00:01 GMT+0530 (IST)

Allu Arjun to team up with Atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు `పుష్ప - ది రైజ్` తో తొలి పాన్ ఇండియా సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. బాలీవుడ్ లో అనూహ్య విజయాన్ని నమోదు చేయడం బన్నీ కెరీర్ కి అదనంగా కలిసొచ్చింది. హిందీ వెర్షన్ వసూళ్ల పరంగా భారీగా రాబట్టింది. నిజానికి ఈ స్థాయి సక్సెస్ అక్కడ నుంచి దక్కుతుందని టీమ్ కూడా ఊహించలేదు. ఆ రకంగా బన్నీకి పుష్ప బెస్ట్ లాంచింగ్ మూవీ అయింది. దీంతో బన్నీ `పుష్ప` రెండవ భాగంపైనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాడు. మొదటి భాగం సక్సెస్ నేపథ్యంలో పార్ట్ -2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్-2 రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు.రెండవ భాగంతోనూ సక్సెస్ కొట్టి పాన్ ఇండియా క్రేజ్ ని రెట్టింపు చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాడు. ఇంత వరకూ బన్నీ ప్లానింగ్ బాగానే ఉంది. పార్ట్ -2 తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు? అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీ క్యూలో చాలా మంది దర్శకులు ఉన్నారు. ఇప్పటికే  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` చిత్రాన్ని ప్రారంభించి ఆపేసారు. మరి ఆ సినిమాని  ముందుకు తీసుకెళ్తారా? మధ్యలోనే ఆపేస్తారా? అన్నది క్లారిటీ రావాలి. అలాగే కొరటాల శివ..బోయపాటి శ్రీను.. లింగు స్వామి లాంటి వారు బన్నీ మైండ్ లో ఉన్నారు. తాజాగా ఈ వరుసలోకి కోలీవుడ్ యంగ్ మేకర్ అట్లీ వచ్చాడు.

అతడితో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు గుసగుస వినిపిస్తోంది.  ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అట్లీ కంటెంట్ కి తిరుగులేదు. అపజయమెరుగని దర్శకుడిగా పేరుంది.  ఈ నేపథ్యంలో బన్నీ కెరీర్ కి అట్లీ తోడైతే సక్సెస్ కి ఛాన్సెస్ ఎక్కువగా  కనిపిస్తున్నాయి. అట్లీ కంటెంట్ కూడా పాన్ ఇండియా అప్పీల్  ని తీసుకొస్తుంది. మరి బన్నీ తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే పుష్ప-2 షూటింగ్ పూర్తయితే గానీ సంగతేంటి? అన్నది తేలదు.