Begin typing your search above and press return to search.

నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇంటిని ప్లాన్ చేస్తున్న బన్నీ!

By:  Tupaki Desk   |   23 Jan 2020 6:14 AM GMT
నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇంటిని ప్లాన్ చేస్తున్న బన్నీ!
X
ఆశలు.. కలలు అందరికీ ఉంటాయి. అయితే వాటిని నెరవేర్చుకోవడం మాత్రం అందరి వల్లా కాదు. కొందరు వాటిని ఎలాగైనా నెరవేర్చుకుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలలోనే ఉన్నారట. అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇదే ఊపు లో ఒక భారీ ఇంటిని నిర్మించే ప్లాన్ లో ఉన్నారట.

'అల వైకుంఠపురములో' సినిమాలో చూపించిన 'వైకుంఠపురం' ఇల్లు నిజ జీవితం లో ఒక మీడియా అధినేత బంధువులది. ఈ ఇంటిని చూసి అల్లు అర్జున్ ఫిదా అయ్యారని.. ఇలాంటిదే ఒక రాజభవనం లాంటి ఇంటిని నిర్మించుకోవాలనే కోరిక కలిగిందని సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారట. హైదరాబాద్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు గా ఒక ఇంటిని డిజైన్ చేసే బాధ్యతను ప్రముఖ ఆర్కిటెక్ట్ కు అప్పగించారట. నాన్నగారు అల్లు అరవింద్ కు సంబంధించిన స్థలం లో ఈ ఇంటి నిర్మాణం చేపడతారని సమాచారం.

ఈ ఇంటి లో ప్రతి విషయం ప్రత్యేకం గా ఉండాలని.. అన్ని వసతులతో పాటుగా ఆధునిక సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్లో అడుగు పెడితే మతి పోయేలా ఉండబోతోందట. ఎంతైనా స్టైలిష్ స్టార్ కదా.. కారవాన్ అయినా వైకుంఠపురం అయినా ఆయన రేంజ్ కు తగ్గట్టే ఉండాలి.