Begin typing your search above and press return to search.

వ‌రుణ్ నిశ్చితార్థం.. విదేశాల‌ నుంచి పుష్పరాజ్ ఆగ‌యా

By:  Tupaki Desk   |   9 Jun 2023 9:12 PM
వ‌రుణ్ నిశ్చితార్థం.. విదేశాల‌ నుంచి పుష్పరాజ్ ఆగ‌యా
X
అల్లు అర్జున్ త‌న‌ భార్య స్నేహా రెడ్డి ఇత‌ర కుటుంబం తో యూరప్ వెకేషన్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఓ వైపు వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని క‌థ‌నాలు వ‌స్తుండ‌గా పుష్ప విదేశాల‌ కు వెళ్లాడు. అత‌డు ఈ వేడుక‌ కు వేంచేస్తాడా? అంటూ కొన్ని మీడియాలు ప్ర‌శ్నించాయి. అన్ని ప్ర‌శ్న‌ల‌ కు ఇప్పుడు సమాధానం దొరికింది.

ఎట్ట‌కేల‌ కు రెండ్రోజుల క్రితం అల్లు అర్జున్ -స్నేహా రెడ్డి జంట‌ యూరప్‌ విహారయాత్ర ను ముగించి ముంబై లో ల్యాండ్ అయ్యారు. దంపతులు ఇరువురూ ఒక‌రి చేతి ని ఒక‌రు ప‌ట్టుకుని విమానాశ్ర‌యం లో క‌నిపించారు. ఇప్ప‌టికే యూరప్ ట్రిప్ ఫోటోలు అంత‌ర్జాలం లో వైర‌ల్ అయ్యాయి.

ఇంత‌ లోనే వ‌రుణ్ తేజ్ నిశ్చితార్థం కోసం అల్లు అర్జున్ స్పెష‌ల్ లుక్ తో నేడు వెన్యూ వ‌ద్ద‌ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. వ‌రుణ్ తేజ్ స్వ‌గృహం లో జ‌రిగిన ఈ నిశ్చితార్థ వేడుక‌ లో అత‌డు పైజామా లాల్చీ తో ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపించాడు. అత‌డు కార్ లో వ‌రుణ్ ఇంటి ప‌రిసరాల‌ కు వ‌స్తున్న‌ప్ప‌టి స్నాప్స్ వీడియో ఇప్ప‌టికే అంత‌ర్జాలం లో వైర‌ల్ అయ్యాయి. అత‌ డి రాక‌ తో అభిమానులు పుష్ప‌రాజ్ ఆగ‌యా! అంటూ ఆ ఫోటోల్ని అంత‌ర్జాలం లో వైర‌ల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈవెంట్ వేళ బ‌న్ని ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి.

అల్లు అర్జున్ 'పుష్ప 2' లుక్ ఇప్ప‌టికే రివీలైంది. రెండు విభిన్న‌మైన వేష‌ధార‌ణ‌ల్లో అత‌డి రూపాని కి సంబంధించిన ఫోటోలు అభిమాను ల్లోకి దూసుకెళ్లాయి. ఈ చిత్రం విడుదల తేదీ కి సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఊపిరి ఉగ్గ‌బ‌ట్టి ఎదురు చూస్తున్నారు. ఈసారి సౌత్ కంటే నార్త్ లో పుష్ప ఫీవ‌ర్ మ‌రింత‌గా రాజుకుపోతుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఈ సీక్వెల్ సినిమా తో 1000 కోట్లు కొల్ల‌గొట్టాల‌న్న బ‌ల‌మైన ల‌క్ష్యం తో పుష్ప బృందం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. అల్లు అర్జున్ ని నెవ్వ‌ర్ బిఫోర్ అవ‌తార్ లో సుకుమార్ తెర‌ పై ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు ఫహద్ ఫాసిల్- రష్మిక మందన్న- అన‌సూయ త‌దిత‌రుల న‌టిస్తున్నారు.

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సుదీర్ఘ టీజర్ లో పుష్ప రాజ్ సాగా రూపురేఖల పై విస్త్ర‌తంగా చర్చ సాగింది. స్టైలిష్ రెడ్ సాండల్స్ స్మగ్లర్ పుష్ప‌రాజ్ ని పోలీసులు టార్గెట్ చేయ‌డం తో ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ఆద్యంతం హీటెక్కించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తొలి సినిమా విజయం తర్వాత పుష్ప 2 పాన్ ఇండియా రిలీజ్ కోసం స‌ర్వ‌స‌న్నాహ‌కాలు చేస్తున్నార‌ని స‌మాచారం.