త్రివిక్రమ్ కోసం విక్రమ్ ను పక్కనబెడతాడా?

Fri Aug 10 2018 16:21:56 GMT+0530 (IST)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ సినిమా 'నాపేరు సూర్య' బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఫైనలైజ్ చేసే విషయంలో చాలా సమయం తీసుకుంటున్నాడు. రెండు నెలలయినా ఇప్పటివరకూ తన కొత్త సినిమాను ప్రకటించకపోవడానికి కారణం అదే.  'మనం' ఫేం విక్రమ్ కుమార్ సినిమా ఫైనల్ అయింది..  అదిగో ఇదిగో అంటున్నారు గానీ అది ఇప్పుడు హోల్డ్ లోకి వెళ్లిందని సమాచారం.ఖచ్చితంగా హిట్ సాధించాల్సిన దశలో విక్రమ్ కుమార్ తో చేయడం కరెక్టా కదా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడట బన్నీ.   విక్రమ్ తీసే సినిమాను ఎక్స్ పరిమెంట్స్.. క్లాస్ గా ఉంటాయి గానీ  మాస్ జనాలను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ఉండవు.  దీంతో బన్నీ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాడట.  అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ పై కాస్త పాజిటివ్ గా ఉన్నాడట.  త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా దసరా కు రిలీజ్ కానుంది.  ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. వెంకీ తో ఒక సినిమా లైన్ లో ఉన్న అది సెట్స్ మీదకు వెళ్లేందుకు మరికొంత సమయం పడుతుందట. దీంతో బన్నీ త్రివిక్రమ్ వైపు చూస్తున్నాడట. గురూజీ అయితే తన ఇమేజ్ కి తగ్గట్టు సినిమా చేయగలడని భావిస్తున్నాడట.

వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'జులాయి'.. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. సో.. ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్. అలా జరిగితే.. విక్రమ్ ఇప్పుడు మరో హీరోను వెతుక్కోవాలి.