బన్ని మేనమామ.. ఏఏ 20 నిర్మాత హఠాన్మరణం

Wed Jan 22 2020 22:05:06 GMT+0530 (IST)

Allu Arjun Uncle Dies Of Heart Attack

బన్ని మేనమామ .. ఏఏ 20 నిర్మాత ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం చెందారు. ఓవైపు బన్ని అల వైకుంఠపురములో సక్సెస్ ని ఆస్వాధిస్తున్న వేళ ఊహించని ఈ షాక్ అల్లు కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. బన్ని మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఉదయం విజయవాడలో కన్నుమూశారు. ఇది అకాల మరణం. ఆయన తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.మేనమామతో బన్నీ అనుబంధం ఎంతో గొప్పది. చిన్నప్పటి నుంచి అతడితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మలా దేవికి స్వయానా అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య. అకస్మాత్తుగా ఆయన కన్నుమూయడంతో అల్లు కుటుంబం పూర్తిగా షాక్ కి గురైంది. ఈ విషాద వార్త గురించి తెలుసుకున్న అల్లు కుటుంబం మొత్తం విజయవాడకు వెళ్లింది.

బన్ని ఓవైపు AA20 కోసం ప్రిపేరవుతున్నారు. ఈ సినిమా కోసం ముత్తంశెట్టి ప్రసాద్ నిర్మాతగానూ మారారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఆయన నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతున్నారు. మేనమామ సినీఅరంగేట్రంపై బన్ని సహా అల్లు కుటుంబం ఎగ్జయిటింగ్ గా ఉంది. మరోవైపు ముత్తంశెట్టి ఫ్యామిలీలో సైతం ఉత్సాహం నెలకొంది.  అందుకే అతని ఆకస్మిక మరణం అందరినీ షాక్ కు గురిచేసింది. సహచరుని మరణం మైత్రి సహనిర్మాతల్లోనూ ఆందోళన వ్యక్తమైంది.