Begin typing your search above and press return to search.

#AA20 : ఆ టైటిల్‌ కాదురా బాబు

By:  Tupaki Desk   |   20 Jan 2020 6:45 AM GMT
#AA20 : ఆ టైటిల్‌ కాదురా బాబు
X
అల్లు అర్జున్‌ సంక్రాంతి కి అల వైకుంఠపురంలో చిత్రంతో వచ్చి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. బన్నీ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ గా అల వైంకుఠపురంలో చిత్రం నిలిచింది. ఈ సమయంలో బన్నీతో తదుపరి చిత్రం చేయబోతున్నది సుకుమార్‌ అవ్వడంతో మరో బ్లాక్‌ బస్టర్‌ కన్ఫర్మ్‌ అన్నట్లుగా ఫ్యాన్స్‌ ఎంతో ఉత్కంఠభరితంగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయం లో సినిమా గురించిన ఏ చిన్న విషయం అయినా జనాల్లో తెగ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.

ఇటీవల ఈ చిత్రంకు 'శేషాచలం' అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఒక ఎడిటెడ్‌ ఫొటో టైటిల్‌ తో పాటు వచ్చింది. దాంతో అంతా కూడా శేషాచలం నిజం అయ్యి ఉంటుందని భావించారు. అడవి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది కనుక సినిమాకు అదే నిజమైన టైటిల్‌ అయ్యి ఉంటుందేమో అని సినీ వర్గాల వారు కూడా భావించారు. కాని శేషాచలం టైటిల్‌ నిజం కాదని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. కొన్ని మీడియా సంస్థల్లో మరియు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు. టైటిల్‌ విషయంలో ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. టైటిల్‌ విషయమై మరికొన్ని రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక షెడ్యూల్‌ పూర్తి చేసిన యూనిట్‌ సభ్యులు రెండవ షెడ్యూల్‌ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ ఈనెల చివర్లో సుకుమార్‌ మూవీలో జాయిన్‌ అయ్యే అవకాశాలున్నాయి.