Begin typing your search above and press return to search.

పుష్ప ఆరవ వేలు : క్రియేటివిటీనా? తప్పు జరిగిందా?

By:  Tupaki Desk   |   8 April 2020 7:50 AM GMT
పుష్ప ఆరవ వేలు : క్రియేటివిటీనా? తప్పు జరిగిందా?
X
నేడు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు అవ్వడంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న 20వ చిత్రం పుష్ప ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఉదయం 9 గంటలకు ఒక ఫొటోను విడుదల చేసిన మేకర్స్‌ ఆ వెంటనే రెండు గంటలకే బన్నీ గందపు చెక్కల ముందు పోలీసుల కాళ్ల వద్ద కూర్చున్న ఫొటోను విడుదల చేశారు. ఆ ఫొటోతో బన్నీ గందపు చెక్కల స్మగ్లర్‌ అంటూ క్లారిటీ వచ్చేసింది. ఇక రెండవ సారి విడుదలైన పోస్టర్‌ ను కాస్త తీక్షణంగా దీర్ఘంగా పరిశీలిస్తే అందులో బన్నీ కాలుకు ఆరవ వేలు ఉంది.

అల్లు అర్జున్‌ కు ఆరవ వేలు ఉన్నట్లుగా గతంలో ఎప్పుడు కూడా వార్తలు రాలేదు. ఈ పోస్టర్‌ లో బన్నీ కాలుకు ఆరవ వేలు ఉండటంతో చర్చ మొదలైంది. దర్శకుడు సుకుమార్‌ కథలో భాగంగా బన్నీకి ఆరవ వేలు పెట్టి ఉంటాడా లేదంటే డిజైనర్‌ పొరపాటున బన్నీకి ఆరవ వేలు పెట్టి ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. బన్నీ పోస్టర్‌ చూస్తుంటే ఎక్కువగా డిజైనింగ్‌ పార్ట్‌ ఉంది. కనుక అది డిజైనింగ్‌ లోపం అయ్యి ఉంటుందని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు మాత్రం సుకుమార్‌ పాత్ర కోసం పెట్టి ఉంటాడేమో అంటున్నారు.

లేదంటే బన్నీకి బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ కు లక్కీ ఫింగర్‌ ఉన్నట్లుగా కాలికి ఆరవ వేలు కూడా ఉందేమో అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ పుష్ప లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సందర్బంగా ఈ విషయం పై కూడా విశేషంగా చర్చ జరుగుతోంది. ఈ ఆరవ వేలు గురించి యూనిట్‌ సభ్యులు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.