డిబేట్: తగ్గేదే లే..! బన్ని ఎవరినుద్ధేశించి?

Thu Apr 08 2021 10:08:12 GMT+0530 (IST)

Allu Arjun Speech At Pushpa Teaser Launch Event

బన్ని బర్త్ డే కానుకగా పుష్ప టీజర్ రిలీజైంది. మాస్ యాక్షన్ అవతారంతో బన్ని అదరగొట్టాడు. పుష్ప టాలీవుడ్ లో మరో రీఫ్రెషింగ్ స్టోరీతో సంచలనాలు సృష్టించడం ఖాయమని బన్ని అభిమానులు సహా ఇండ్ట్రీ వర్గాల్లోనూ టాక్ బలంగా వినిపిస్తోంది.ఇకపోతే ఈ బుధవారం సాయంత్రం పుష్ప టీజర్ వేడుకలో బన్ని స్పీచ్ ఆద్యంతం ఆలోచింపజేసిందనేది సోషల్ మీడియా డిబేట్. ఈ స్పీచ్ లో అతడు తగ్గేదే లే! అంటూ అభిమానుల్ని ఉత్సాహపరిచాడు. అమ్మాయిలు తగ్గి ఉండాలని అనుకుంటారు. కానీ ఎవరికోసం తగ్గాల్సిన పనే  లేదు. ఇది ఆడా మగా అనే ఏం లేదు. అందరికీ వర్తిస్తుంది.. తగ్గేదేలే.. అని బన్ని అభిమానులనుద్ధేశించి అన్నారు.  

``పుష్ప సినిమాలో తగ్గేదే లే అనే డైలాగ్ ఉంది.. వ్యక్తిగతంగానూ నాకు నేను ఆ మాట చెప్పుకుంటా.. ఎందుకంటే.. మీ అందరిలాగే నాకూ భయాలు ఉంటాయి.. కానీ ధైర్యం చేసి ముందుకు వెళ్లాలి.. తగ్గేదే లేదు అని అనుకుంటా.. అలా అనుకున్నా కాబట్టే ఇంత దూరం వచ్చాను`` అని బన్ని అన్నారు.

నిజానికి పుష్ప వేదికపై బన్ని మోటివేషనల్ స్పీచ్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. స్టైలిష్ స్టార్ ని ఈ వేదికపై ఐకన్ స్టార్ గా మలిచారు సుకుమార్. ఇక దాని గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సుక్కూ ఏం ఇచ్చినా గుర్తుండిపోతుంది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌కి వెళ్లిపోవాలని అంటున్నావ్. థాంక్యూ డార్లింగ్. సింపుల్ గా చెప్పాలంటే.. ఐకాన్ స్టార్ చాలా స్టైల్ గా ఉంది కదా.. నాకూ నచ్చింది అని బన్ని అన్నారు.