Begin typing your search above and press return to search.
పుష్ప తో బాహుబలి సరసన చేరిపోయాడు!
By: Tupaki Desk | 24 Jan 2022 3:30 PMఅల్లు అర్జున్ పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏకంగా మూడు వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా ఒక్క బాలీవుడ్ లో కాస్త అటు ఇటుగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకుందంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. బాలీవుడ్ లో పుష్ప తో అల్లు అర్జున్ కు దక్కిన క్రేజ్ తో ముందు ముందు రాబోతున్న సినిమాలన్నీ కూడా మినిమం వంద కోట్లు అక్కడ వసూళ్లు చేస్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎలా అయితే పెరిగిందో పుష్ప సినిమా తో బన్నీకి కూడా అలాగే క్రేజ్ పెరిగింది అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన తో పాన్ ఇండియా సినిమాలను నిర్మించేందుకు బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు కాకుండా బన్నీ పెద్ద నిర్మాణ సంస్థలతో సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికర పుకారు వినిపిస్తుంది. అల్లు అర్జున్ తో ఒక భారీ సినిమాను నిర్మించేందుకు గాను లైకా ప్రొడక్షన్స్ వారు ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాకు గాను ఏకంగా బన్నీకి వంద కోట్ల పారితోషికంను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. బాహుబలి మరియు సాహో సినిమాల తర్వాత ప్రభాస్ వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ స్థాయి పారితోషికంను సౌత్ నుండి అల్లు అర్జున్ కూడా లైకా వారి ద్వారా అందుకుంటున్నట్లుగా ఆ పుకారు సారాంశం. సౌత్ హీరోల్లో వంద కోట్ల పారితోషికం తమిళ స్టార్ విజయ్ అందుకుంటున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కనుక ఆయన చేసే ప్రతి సినిమాకు కూడా వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు అనే టాక్ ఉంది.
ఒక్క పుష్ప తో బన్నీ వంద కోట్ల పారితోషికం కు అర్హుడా అంటే ఖచ్చితంగా అర్హుడే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే పుష్ప సినిమా తో బన్నీ తన స్టామినా ఏంటో నిరూపించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ.. తమిళనాడు మరియు కన్నడం లో భారీగా వసూళ్లను దక్కించుకున్న బన్నీ బాలీవుడ్ లో కూడా భారీ వసూళ్లు దక్కించుకున్నాడు. కనుక పుష్ప సినిమా బన్నీ ఇమేజ్ ను ఖచ్చితంగా వంద కోట్లకు పెంచింది అంటూ విశ్లేషకులు మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప సినిమా పార్ట్ 2 కూడా విడుదల అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ స్థాయి మరింత పెరగడం ఖాయం.. ఇక మీదట బన్నీ అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.