Begin typing your search above and press return to search.

బన్నీ మూవీని తెగ పొగిడేస్తున్న బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్!!

By:  Tupaki Desk   |   13 July 2020 9:50 AM GMT
బన్నీ మూవీని తెగ పొగిడేస్తున్న బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్!!
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన హ్యాట్రిక్ సినిమాగా రూపొందిన “అల వైకుంఠపురంలో” సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై లాభాల పంట పండించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలతో పాటు, డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి లాభాలు గడించారు. ఈ మధ్య తెలుగులో విడుదలైన సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ లభిస్తుంది. మంచి సినిమాలను ఎంత పెట్టి కొనడానికైనా బాలీవుడ్ నిర్మాతలు వెనకడుగు వేయరు. అందులో భాగంగా “అల వైకుంఠపురంలో” సినిమా నిర్మాణ హక్కులను భారీ ధర వెచ్చించి అశ్విన్ వర్దె అనే సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కేవలం తెలుగు బాషలో మాత్రమే విడుదలై దాదాపు 150కోట్ల వరకు వసూల్ చేసింది.

ఇక లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు అంతా కూడా ఇంటి పట్టునే ఉంటూ సినిమాలు చూస్తూ.. వారి కొత్త కథలను రాసుకుంటున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా చూసి తెగ పొగిడేస్తున్నాడు. అంతేగాక ఈ సినిమా హీరో.. అంటే అల్లు అర్జున్ కి అభిమానిగా మారానని ఆశ్చర్యానికి గురిచేశాడు. నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూసిన సంజయ్ గుప్తా.. ఆ వెంటనే ట్విట్టర్ ద్వారా 'సినిమా అద్భుతంగా ఉందని.. ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్ తెగ నచ్చిందని' తెలిపాడు. దానికి బన్నీ స్పందించి 'మా సినిమా చూసినందుకు ధన్యవాదాలు సార్. మీకు నచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉందని అన్నాడు. మళ్లీ సంజయ్ స్పందించి.. "మీకు నటనకి నేను చాలా కనెక్ట్ అయిపోయా. మీ అభిమానిగా మారిపోయాను. కరోనా ముగిస్తే థియేటర్లో చూస్తా. అలాగే మీతో కలిసి వర్క్ చేయాలని ఎంతో ఆత్రంగా ఉందన్నట్లు సంజయ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం సంజయ్ - బన్నీల సంభాషణ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.