Begin typing your search above and press return to search.

టాలీవుడ్ అడ్డా మార్చేలా అల్లు అర్జున్ బిగ్ ప్లాన్..!

By:  Tupaki Desk   |   1 Jun 2023 1:22 PM GMT
టాలీవుడ్ అడ్డా మార్చేలా అల్లు అర్జున్ బిగ్ ప్లాన్..!
X
ఈమధ్య సినిమా ఈవెంట్ ఏదైనా సరే అదో పెద్ద పండుగలా చేస్తున్నారు. సినిమా టీజర్ రిలీజ్ నుంచి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ ముందు రోజు వరకు సరైన ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్ కు రీచ్ అవుతుందని తెలుసుకున్నారు. ఇదివరకు ఈ టీజర్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లు ప్రసాద్ ఐమాక్స్ లో చేసే వారు. అక్కడ బిగ్ స్క్రీన్ లో ఈ టీజర్ రిలీజ్ లు ఉండేవి. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలను ఆడియన్స్ తో పంచుకునే వారు.

అయితే ప్రసాద్ ఐమాక్స్ లో టీజర్ రిలీజ్ చేయడం కుదరకపోతే ప్రసాద్ ల్యాబ్ స్క్రీన్స్ లో కూడా టీజర్, ట్రైలర్ రిలీజ్ లు చేసే వారు ప్రసాద్ ఐమాక్స్ తో పాటుగా ఇక్కడ కూడా ప్రీమియర్స్ వేస్తుంటారు.

ఎప్పుడైతే మహేష్ AMB మాల్ వచ్చిందో టీజర్, ట్రైలర్ రిలీజ్ లు ప్రీమియర్స్ అన్ని అక్కడే జరుగుతున్నాయి. ఏ.ఎం.బి మాల్ వీటన్నిటికీ సౌకర్యవంతంగా ఉంటుందని అక్కడ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా అల్లు అర్జున్ కూడా ఒక మల్టీప్లెక్స్ ని సిద్ధం చేశారు. అమీర్ పేట సత్యం థియేటర్ ని రెనోవేట్ చేసి ఏసియన్ వారితో కలిసి ఏసియన్ సత్యం, AAA సినిమాస్ అంటూ మల్టీప్లెక్స్ ని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ AAA మాల్ ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తుంది.

అయితే కేవలం సినిమా రిలీజ్ లే కాకుండా ఈ మల్టీప్లెక్స్ లో కూడా టీజర్, ట్రైలర్ రిలీజ్.. స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. మహేష్ మాల్ కి పోటీగా ఇప్పుడు అల్లు అర్జున్ AAA సినిమాస్ రెడీ అవుతుందని చెప్పొచ్చు. సో టాలీవుడ్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అడ్డాని మహేష్ మాల్ నుంచి అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ కి మార్చేలా ప్లాన్స్ జరుగుతున్నాయి.

డిస్టెన్స్ పరంగా కూడా మహేష్ AMB మాల్ కన్నా AAA సినిమాస్ చాలా దగ్గరగా ఉంటుంది. సో మొత్తానికి అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ మహేష్ బిజినెస్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందని చెప్పొచ్చు. స్టార్ హీరోలు కేవలం సినిమాలు మాత్రమే చేయకుండా రకరకాల బిజినెస్ లతో సత్తా చాటుతున్నారు. వాటిలో థియేటర్ బిజినెస్ ఒకటికాగా రెస్టారెంట్, జిం, కాఫీ షాప్ లు లాంటి బిజినెస్ లు కూడా వారు కొనసాగిస్తున్నారు.

మరి అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ మహేష్ AMB మాల్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందా లేదా ఆల్రెడీ అక్కడే అలవాటు పడ్డారు కాబట్టి AMB మాల్ లోనే సినిమా ఈవెంట్స్ జరుగుతాయా అన్నది త్వరలో తెలుస్తుంది.