Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ AAA సినిమాస్ రె-ఢీ?

By:  Tupaki Desk   |   8 Dec 2022 4:20 PM GMT
అల్లు అర్జున్ AAA సినిమాస్ రె-ఢీ?
X
టాలీవుడ్ స్టార్ హీరోల బహుముఖ ప్ర‌జ్ఞ‌.. వ్యాపార సామ్రాజ్య విస్త‌ర‌ణ నిరంత‌రం అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటుంది. ఓవైపు పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ స్టార్ల‌కే స‌వాల్ విసురుతున్న మ‌న స్టార్లు ఇత‌ర‌త్రా వ్యాపార వాణిజ్య కార్య‌క‌లాపాల్లోను త‌మదైన ఒర‌వ‌డితో స‌త్తా చాటుతున్నారు. ముఖ్యంగా మ‌ల్టీప్లెక్స్- థియేట‌ర్ల రంగంపై స్టార్ హీరోలు అమితాస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్ప‌టికే ఏఎంబి సినిమాస్ తో తొలి అడుగు వేసారు. ఆల్రెడీ ప్ర‌భాస్ కూడా భారీ మ‌ల్టీప్లెక్స్ థియేటర్ ని ప్రారంభించాడు. ఇప్పుడు ఆ ఇద్ద‌రి అడుగుజాడల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా థియేటర్ల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడనే విషయం చాలా మందికి తెలుసు. అమీర్‌పేట ప్రధాన జంక్షన్ లో భారీ పెట్టుబ‌డుల‌తో సిద్ధ‌మ‌వుతున్న‌ మల్టీప్లెక్స్ కు ఏషియ‌న్ సినిమాస్ అధినేత‌ల‌తో భాగస్వామిగా కొన‌సాగుతున్నారు.

అమీర్ పేట్‌-మైత్రివనం వద్ద పాపుల‌ర్ సింగిల్ స్క్రీన్ 'సత్యం' ఉన్న ప్రదేశంలో భారీ మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారని చాలా కాలం క్రిత‌మే తుపాకి వెల్ల‌డించింది. గత ఏడాది కాలంగా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సునీల్ నారంగ్ కు చెందిన ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ థియేట‌ర్ల నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారీ ప్ర‌ణాళిక‌తో ఉన్నార‌ని వెల్ల‌డైంది.

తాజాగా ఈ మ‌ల్టీప్లెక్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉందని తాజాగా రిలీజైన ఫోటోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. AAA సినిమాస్ పేరుతో (ఏషియన్ -సత్యం థియేట‌ర్) భారీ మల్టీప్లెక్స్ 2023 సంక్రాంతి విడుదలలతో కార్యకలాపాలు ప్రారంభిస్తుంద‌ని తాజాగా స‌మాచారం అందింది.

స‌త్యం థియేట‌ర్ తెర‌మ‌రుగైనా కానీ త‌మ ఫేవ‌రెట్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ల రంగంలో ప్ర‌వేశించ‌డానికి అభిమానులు ఫుల్ ఖుషీగా మ‌ద్ధ‌తిస్తుండ‌డం ఆసక్తిక‌రం.

వృత్తిపరంగా చూస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేందుకు సిద్ధ‌మవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశ పూర్త‌వుతోంది. రష్యా నుండి బ‌న్ని తిరిగి హైద‌రాబాద్ కి వచ్చిన వెంటనే (కొన్ని రోజుల క్రితం పుష్ప-1ని ప్రమోట్ చేయడానికి బృందం వెళ్ళింది) పుష్ప 2 చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ అసాధార‌ణ హైప్ తో తెర‌కెక్కనుంద‌ని స‌మాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.