బన్నీ స్పెషల్ ట్రైయినర్ చిత్తురు నుంచే

Mon Feb 17 2020 12:45:20 GMT+0530 (IST)

Allu Arjun Looking To Perfect The Rayalaseema Slang!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సుకుమార్ కేరళ అడవుల్లో టెస్ట్ షూట్ చేసుకుని తిరిగొచ్చారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. చిత్తూరు జిల్లా అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. దాదాపు 90 శాతం చిత్రీకరణ ఫారెస్ట్ లోనే ఉంటుంది. శేషాచలం అడవుల్లో అనుమతి లేని కారణంగా బ్యాంకాక్ అడవుల్లో ఆ సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరనో వైరస్ భయం ఉంది కాబట్టి...కొన్నినెలలు ఆగి పయనం కానున్నారు.ఈలోపు సుకుమార్ టీమ్ ని అన్నిరకాలుగా సిద్ధంచేయాల్సి ఉంది. ఇప్పటికే స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు తిరుపతిలో నే స్టార్ హంట్ నిర్వహించి కొంత మంది ఔత్సాహికుల్ని సుకుమార్ తీసుకున్నాడు. చిత్తూరు నేపథ్యం తో కూడాని స్టోరీ కాబట్టి అక్కడి యాసభాష..ఆహార్యం అన్ని పక్కాగా కుదరాలి. అంటే అంతకు ముందే కీలక నటులందర్నీ ట్రైనప్ చేయాలి. దీనిలో భాగంగా బన్నీ చిత్తూరు యాస నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఓ ట్రెయినర్ ని నియమించారు. బన్నీ ఏ ప్రాంత యాసనైనా ఇట్టే పట్టేయగలడు.

అయితే అందుకు పర్ పెక్ట్ ట్రెయినర్ కావాలి. సరిగ్గా అలాంటి నేర్పరినే సుకుమార్ వెతికి పట్టుకున్నాడు. నేరుగా చిత్తూరు నుంచే అక్కడి మాండలికం బాగా తెలిసిన ఓ సీనియర్ ని హైదరాబాద్ కి రప్పించారుట. సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ మొత్తం వివరించి..బన్నీ వాయిస్ ఇలా ఉండాలని సూచించాడుట. సుకుమార్ సలహాలు...ట్రెయినర్ సొంత ఐడియాలతో బన్నీని ఎలా ట్రైయిన్ చేయాలో తనకి తెలుసునని సుక్కుకి మాటిచ్చాడుట సదరు ట్రైయినర్. ప్రస్తుతం బన్నీ ఫ్యామిలీ తో విదేశీ టూర్ లో ఉన్నాడు. అల వైకుంఠపురము లో సక్సెస్ అయిన సందర్భంగా విదేశీ టూర్ వేసాడు. బన్నీ తిరిగి హైదరాబాద్ రాగానే చిత్తూరు యాస నేర్చుకునే పనిలో బిజీ కానున్నాడని సమాచారం.