Begin typing your search above and press return to search.

'పుష్ప' కు బ్రేక్ ఇచ్చి దుబాయ్ కు పయనమైన బన్నీ..!

By:  Tupaki Desk   |   24 Sep 2021 5:30 PM GMT
పుష్ప కు బ్రేక్ ఇచ్చి దుబాయ్ కు పయనమైన బన్నీ..!
X
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది రైజ్' అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. క్రిస్మస్ సీజన్ ని టార్గెట్ గా పెట్టుకొని షూటింగ్ జరుపుతున్నారు. అయితే బన్నీ ఈ టైట్ షెడ్యూల్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలసి దుబాయ్ లో ఉన్నాడు.

తాజాగా బన్నీ దుబాయ్ ట్రిప్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో నైట్ విజువల్స్ లో అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. పెళ్లి తర్వాత బన్నీ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్నారు. షూటింగ్ గ్యాప్ దొరిగితే తన ఇద్దరు పిల్లలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. బన్నీ ఇలా తన ఫ్యామిలీతో కలిసి హాలిడే కి వెళ్లాడాన్ని అనేక సందర్భాల్లో చూశాం. అలానే ఇప్పుడు తన భార్యా పిల్లలతో కలిసి దుబాయ్ లో సంతోషంగా గడుపుతున్నారు.

కాగా, 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ''పుష్ప'' సినిమాతో తొలిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. దీని కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యారు బన్నీ. లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా మారడానికి చాలా కష్టపడ్డారు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన సెకండ్ సింగిల్ ను దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 'ఆర్య' 'ఆర్య 2' తర్వాత సుకుమార్ - బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ''పుష్ప'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.