నెల ఆలస్యం చేస్తున్న అల హీరో!

Sat Feb 15 2020 20:00:01 GMT+0530 (IST)

Allu Arjun Goes Into Relax Mode Post 'Ala Vaikunthapuramlo'!

అల్లు అర్జున్ లాస్ట్ సినిమా 'నాపేరు సూర్య' ఫ్లాప్ కావడంతో గ్యాప్ తీసుకుని అలోచించి మరీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ సినిమాకోసం జోడీకట్టారు. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' భారీ విజయం సాధించడంతో ఫుల్లు సంతోషంగా ఉన్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జోరుగా సాగాయి. ఈ సినిమా తర్వాత బన్నీ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.నిజానికి ఫిబ్రవరిలోనే అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే మార్చి నుంచి షూటింగ్ లో పాల్గొంటానని అల్లు అర్జున్ సుకుమార్ టీమ్ కు సమాచారం ఇచ్చారట. సుకుమార్ సినిమా షూటింగ్ లలో పాల్గొనే ముందు కొన్నిరోజుల కుటుంబం తో గడిపేందుకు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఈ గ్యాప్ తీసుకుంటున్నారట.

సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో ఈ కొత్త సినిమాపై కూడా ఆసక్తి వ్యక్తం అవుతోంది. అదొక్కటే కుండా సుకుమార్ 'రంగస్థలం' తర్వాత.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత కలిసి పని చేస్తూ ఉండడంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరుగుతున్నాయి.