నవదీప్ కి బన్ని బావ్స్ ఇచ్చిన గిఫ్టేంటో

Sat May 14 2022 08:00:01 GMT+0530 (IST)

Allu Arjun Gift To Navdeep

స్నేహానికి విలువిచ్చే హీరోగా బన్నీకి గుర్తింపు ఉంది. అతడు తన కొలీగ్స్ తో ఎంతో స్నేహంగా ఉంటారు. అయితే అందులో కొందరు స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇకపోతే హీరో నవదీప్ బన్నీకి చాలా కాలంగా మంచి స్నేహితుడు. ఆర్య2లో ఆ ఇద్దరూ కలిసి నటించారు కూడా. అల్లు అర్జున్ ని `బావ్స్` అని పిలిచేంత సాన్నిహిత్యం నవదీప్ కి ఉంది. అతడికి ఇప్పుడు బన్నీ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందింది. అందుకు సంబంధించిన ఫోటోని కూడా నవదీప్ షేర్ చేయగా వైరల్ గా మారింది.పుష్ప హీరో అల్లు అర్జున్ ఇచ్చిన బహుమతి ఇది. అందుకే అతడు ఎమోషనల్ అయ్యాడు. ``ప్రేమకు అవధులు లేనప్పుడు.. బహుమతులు సందర్భానుసారంగా ఉంటాయి. ధన్యవాదాలు బావ్స్ అల్లు అర్జున్. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్ తో ఎయిర్ పొడ్స్ వాడతా`` అని ఎమోషన్ అయ్యాడు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. నవదీప్ ప్రస్తుతం అవనీంద్ర దర్శకత్వం లో లవ్ మౌళిలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలి కాలంలో తన కెరీర్ గ్రాఫ్ ని చక్కదిద్దుకునేందుకు నవదీప్ మరోసారి ప్రయత్నిస్తున్నాడు. అయితే బావ్స్ బన్నీ తన పుష్ప 2లో అవకాశం కల్పిస్తాడేమో చూడాలి.