స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఎందుకు డుమ్మా కొట్టారు?

Tue Sep 17 2019 10:20:02 GMT+0530 (IST)

Allu Arjun Fans Not Attend for Varun Tej Valmiki Movie Pre Release Event

ఇంకో నాలుగు రోజుల్లో వాల్మీకి సందడి మొదలవుతుంది. సైరాకు పన్నెండు రోజుల గ్యాప్ ముందు వస్తున్న మూవీ కాబట్టి మెగాభిమానులు వరస సెలబ్రేషన్స్ కు సిద్ధపడుతున్నారు. మొన్న జరిగిన వాల్మీకి ప్రీ రిలీజ్ లో అందరు మెగా హీరోల ఫ్యాన్స్ సందడి బాగానే కనిపించింది. కేవలం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ తోనే సభ కిక్కిరిసిపోవడం అన్నది జరగని పని. వరుణ్ మీద సాఫ్ట్ కార్నర్ తో చిరు మొదలుకుని చరణ్ దాకా అందరి మద్దతు ఇతగాడికి ఉంది. ఇదిలా ఉంచితే ఆ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ హాజరు లేదని ఇన్ సైడ్ టాక్. ఉద్దేశపూర్వకంగా ముందస్తు మాట మేరకు డిసైడ్ అయ్యాకే రాలేదని ఈ పరిణామాలు ముందు నుంచి గమనిస్తున్న కొందరు మెగా ఫ్యాన్స్ చెప్పడం గమనార్హం.నిజానికి బన్నీకి ఇతర మెగా హీరోల అభిమానులకు చెప్పను బ్రదర్ ఇష్యూ నుంచే గ్యాప్ మొదలైంది. దాని ప్రభావం అప్పట్లో డీజే టీజర్ కు లక్షల్లో డిజ్ లైకులు వచ్చినపుడు బయటపడింది. శ్రీరెడ్డి ఇష్యూలో పవన్ ఫిలిం ఛాంబర్ కు వెళ్ళినప్పుడు ముందుగా అక్కడికి చేరుకొని సపోర్ట్ చేసింది అల్లు అర్జునే. ఇటీవలే బర్త్ డే కు విష్ చేశాడు కూడా కానీ వాల్మీకి వేడుకలో తన ఫ్యాన్స్ ఎందుకు రాలేదన్నది మాత్రం రహస్యంగా మిగిలిపోయింది.

ఇప్పటికీ కొందరు బన్నీ ఫ్యాన్స్ తమ హీరో వేరని మెగా కాంపౌండ్ తో కలపాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో ఉన్నారు. మరికొందరు చిరంజీవి వేసిన రోడ్ లోనే తామందరం నడుస్తున్నామని అల్లు అర్జున్ చాలా సార్లు చెప్పాడు కాబట్టి అలా ఆలోచించడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏది ఏమైనా స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ వాల్మీకి ఈవెంట్ లో లేకపోవడం కొంత చర్చకైతే దారి తీసింది. దసరా పండగా సందర్భంగా విడుదల చేయబోయే అలా  వైకుంఠపురము టీజర్ లాంచ్ లో దీనికి సంబంధించి ఏమైనా క్లూ దొరుకుతుందేమో వేచి చూడాలి