Begin typing your search above and press return to search.

అడవుల్లో అల్లు ఫ్యామిలీ స్పెషల్ ఫొటో

By:  Tupaki Desk   |   5 July 2022 7:18 AM GMT
అడవుల్లో అల్లు ఫ్యామిలీ స్పెషల్ ఫొటో
X
పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా అల్లు అర్జున్ మరోసారి వెండితెరకు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు అనే చెప్పాలి. సెకండ్ పార్ట్ కోసం చాలా తొందరగా సిద్ధం అవ్వాలని అనుకున్నప్పటికీ కూడా అందుకు తగ్గట్టు ప్రణాళికలు రెడీ అవ్వలేదు. ఇక ఈ సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక లాంగ్ ట్రిప్ అయితే వేశాడు. ఇటీవల కొన్ని దేశాలు చుట్టేసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లేటెస్ట్ గా టాంజానియాలు దిగిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆ అడవిలో తన ఇద్దరు పిల్లలను తీసుకొని అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అల్లు స్నేహారెడ్డి అల్లు అర్జున్ అలాగే వారి ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ కూడా ఫోటోకి స్టిల్ ఇచ్చిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ లో ఒకరైన అల్లు అర్జున్ కాస్త సమయం దొరికినా కూడా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు.

ఇక రాబోయే రోజుల్లో పుష్ప సెకండ్ పార్ట్ తో మరింత బిజీగా ఉండే అవకాశం ఉంటుందని అనుకున్నారో ఏమోగానీ ఇప్పుడు మాత్రం వీలైనంత ఎక్కువ సమయాన్ని కుటుంబం కోసమే కేటాయిస్తున్నాడు. ఇక మరొకవైపు దర్శకుడు సుకుమార్ సెకండ్ పార్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ అయితే ఆగస్టులో లేదా సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 ది రూల్ కోసం కాస్త ఎక్కువగానే సుక్కు హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా బడ్జెట్ కూడా ఎక్కువగానే పెరగడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు RRR సినిమా కంటే ఎక్కువగానే ఈ సినిమా బిజినెస్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.