ఫ్యాన్స్ కోరారు.. అల్లరోడు చేస్తున్నాడు..!

Wed Mar 22 2023 13:00:01 GMT+0530 (India Standard Time)

Allari Naresh has signed a family movie

అల్లరి నరేష్ ఈమధ్య సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పటి అల్లరోడు మాకు కావాలని ఆయన ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. నాంది హిట్ అవడంతో తను ఇక మీదట సీరియస్ కథలే చేస్తానని నరేష్ చెప్పడం అందరిని షాక్ అయ్యేలా చేసింది.రీసెంట్ గా ఉగ్రం ఈవెంట్ లో కూడా తనని మెప్పించే కథ వస్తే తప్ప మళ్లీ కామెడీ సినిమాలు చేయనని అన్నారు. మనసుకి నచ్చిన కథ వస్తే మాత్రం తప్పకుండా మళ్లీ ఎంటర్టైనింగ్ సినిమా చేస్తానని అన్నారు.

ఇలా ఫ్యాన్స్ కోరారో లేదో అలా ఒక ఫ్యామిలీ సినిమాకు సైన్ చేశారు అల్లరి నరేష్. అల్లరోడు హీరోగా నూతన దర్శకుడు మల్లి అంకం డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది. ఉగాది రోజు ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

అల్లరి నరేష్ సరసన జాతిరత్నాలు భామ ఫరియా అబ్ధుల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తన కామెడీ సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించిన అల్లరి నరేష్ ఒకేసారి తాను కేవలం సీరియస్ సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పడం అందరిని ఆశ్చర్యపరచింది.

అయితే కొంతకాలంగా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ వచ్చి అవి సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో విసుగు చెందిన అల్లరి నరేష్ తన పంథా మార్చాలని అనుకున్నాడు. మహర్షి సినిమాలో రవి పాత్రలో సీరియస్ గా కనిపించి మెప్పించాడు. అయితే ఆ పాత్ర క్లిక్ అవడంతో నాంది సినిమా చేశాడు. నాంది కూడా చాలా రోజుల తర్వాత అల్లరోడికి హిట్ ఇవ్వడంతో ఇక తనని ఆడియన్స్ మార్పు కోరుతున్నారని అలా ఫిక్స్ అయ్యాడు.

కానీ సరైన కథతో అల్లరి నరేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే మాత్రం సూపర్ హిట్ కొట్టే స్కోప్ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే అల్లరి నరేష్ మల్లి అంకం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాజివ్ చిలక నిర్మిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.