Begin typing your search above and press return to search.

నిజంగానే ఆ సీన్లో న్యూడ్ గా కనిపిస్తానంటున్న హీరో

By:  Tupaki Desk   |   22 Jan 2021 6:24 AM GMT
నిజంగానే ఆ సీన్లో న్యూడ్ గా కనిపిస్తానంటున్న హీరో
X
టాలీవుడ్ తెరకి తనదైన కామెడీని రుచి చూపించిన హీరోగా 'అల్లరి' నరేశ్ కనిపిస్తాడు. సీనియర్ నరేశ్ .. రాజేంద్రప్రసాద్ తరువాత, పూర్తిస్థాయి కామెడీ హీరోగా అల్లరి చేసింది నరేశ్ నే. ముఖ్యంగా విలేజ్ నేపథ్యంలో సాగిన ఆయన సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ఒక వైపున కామెడీలో తనకి తిరుగులేదనే విషయాన్ని నిరూపిస్తూనే, మరో వైపున అడపాదడపా కొన్ని విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. 'అల్లరి' నరేశ్ కామెడీని మాత్రమే కాదు, ఎమోషన్ ను కూడా గొప్పగా చేయగలడనే విషయాన్ని నిరూపించాడు.

అలా అల్లరి నరేశ్ చేసిన వైవిధ్యభరితమైన సినిమాగా 'నాంది' కనిపిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు. " ఒక రోజున దర్శకుడు విజయ్ కనకమేడల నా దగ్గరికి వచ్చి ఒక కథ వినిపించాడు. నేను సీరియస్ కథలు చేయను గనుక, వేరే హీరో కోసం అనుకున్న కథను నా అభిప్రాయం తెలుసుకోవడం కోసం చెబుతున్నాడని అనుకున్నాను. కథ చాలా కొత్తగా ఉందని నేను అనగానే, 'హీరో మీరే' అనేశాడు. ఆ మాట వినగానే షాక్ అయ్యాను. ఈ తరహా పాత్రలు చేయనని అంటే, డిఫరెంట్ గా ఉంటుందని ఒప్పించాడు.

ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నేను న్యూడ్ గా కనిపించవలసి ఉంటుందని ఆయన ముందే చెప్పాడు. కథ అంతా బాగానే ఉంది గానీ, ఆ ఒక్క సీన్ గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోననే ఒక సందేహం వెంటాడుతూ ఉండేది. ఏదైనా టెక్నిక్ వాడమని చెబితే దర్శకుడు విజయ్ వినిపించుకోలేదు. చివరికి ఒక రోజున ఆ సీన్ చేయడానికి పిలిచారు. సెట్లో ఉన్నవాళ్లందరినీ దర్శకుడు విజయ్ కాస్త దూరంగా పంపించేశాడు. నేను న్యూడ్ గా ఒక గోడవైపుకు తిరిగి కూర్చున్నాను. విజయ్ టేక్ ఓకే చేసేవరకూ చాలా ఇబ్బందిపడిపోయాను. ఈ సీన్ సినిమాకి ఎంత అవసరమన్నది చూసిన తరువాత మీకే తెలుస్తుంది" అని చెప్పుకొచ్చాడు.