కేసీఆర్... 'టీఆర్ఎస్' వాళ్లను కొనేస్తున్నారట !

Thu Jun 24 2021 06:00:01 GMT+0530 (IST)

All the attention in Telangana now is on Huzurabad

తెలంగాణలో ఇప్పుడు అటెన్షన్ అంతా హుజూరాబాద్ మీదే ఉంది. ఇక్కడ నిన్న టి వరకు ఎమ్మెల్యేగా ఉండి.. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తన పదవులకు రాజీనామా చేసి.. టీఆర్ఎస్ కు బైబై చెప్పేసి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఇటు ఈటలకు బీజేపీకి.. అటు సీఎం కేసీఆర్‌కు టీఆర్ ఎస్ కు చాలా ప్రతిష్టాత్మకం. ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఇక్కడ ఉప ఎన్నికకు రెడీ అయిపోతున్నాయి. ఇటీవల నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున్న టీఆర్ఎస్ తన విజయ పరంపరను హుజూరాబాద్‌లో కూడా కంటిన్యూ చేయాలని చూస్తోంది.పైగా ఈటల కేసీఆర్‌కు నేరుగానే సవాళ్లు రువ్వుతున్నారు. కేసీఆర్ సైతం తాను హుజూరాబాద్ ప్రచారానికి వెళతానని చెప్పడంతో పాటు అక్కడ పెండింగ్ పనులు పెండింగ్ బిల్లుల కోసం కోట్లాది రూపాయలు విడుదల చేస్తూ.. నిధుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల చేసిన ఆరోపణలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. టీఆర్ఎస్ సొంత పార్టీ నాయకులను కొనుక్కొనే పరిస్థితికి దిగజారిందని... కేసీఆర్ నిధుల వరద పారిస్తూ.. తమ పార్టీ నేతలకు డబ్బులు వెదజల్లుతూ.. తమ పార్టీ నేతలు జారిపోకుండా చూసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

టీఆర్ఎస్ తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాదని... ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగే పోరాటమని చెప్పారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలవదని ఈటల చెప్పారు. ఏదేమైనా ఈటల చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందనే చెప్పాలి. ఇప్పటి వరకు హుజూరాబాద్ గోడు పట్టని పార్టీ అధిష్టానం.. ఇప్పుడు సొంత పార్టీ నేతలకు ఉన్న పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో పాటు సొంత పార్టీ నేతలకే ఆఘమేఘాల మీద కోట్లాది రూపాయల వర్క్‌లు కేటాయిస్తోంది. వీరిలో చాలా మంది అసంతృప్తితో ఉండగా.. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు నిధుల వరద పారిస్తోంది. మొత్తానికి సొంత పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకే ఇప్పుడు కోట్లు వెదజల్లాల్సిన పరిస్థితి అయితే ఉందన్నది నిజం.