ఆలియా ఎన్నటికీ మరువలేని ఆ క్షణం

Wed Jun 29 2022 11:00:01 GMT+0530 (IST)

All Eyes On Ranbir Hands In A Romantic Moment

అందమైన అమ్మాయికి హీరో ప్రపోజ్ చేయడం.. చేతి వేలికి ఖరీదైన డైమండ్ రింగ్ ని తొడగడం.. దానికి హీరోయిన్ ఉప్పొంగిపోయి హీరోని హగ్ చేసుకోవడం.. అటుపై డ్యూయెట్లు వగైరా వగైరా వెండితెరపైనే చూస్తుంటాం. కానీ రియల్ లైఫ్ లో కూడా ఇంచుమించు ఇలానే ప్రపోజ్ చేసాడు రణబీర్ కపూర్.తన ప్రేయసి ఆలియా భట్ కి అతడు ఓ స్పెషల్ లొకేషన్ లో పెళ్లి కోసం ప్రతిపాదించాడు. ఆ సమయంలో అతడు తన చేతి వేలికి రింగ్ తొడిగాడు. ఆ ప్రతిపాదనకు ఖరీదైన కానుకకు ఎంతో ఉబ్బితబ్బిబ్బయిన ఆలియా అతడిని కౌగిలింతల్లో చుట్టేసింది. ఎంతో ఎగ్జయిట్ మెంట్ ని ప్రదర్శించింది. తాజాగా ఆలియా షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ తమ లవ్ ప్రపోజల్స్ గురించి సర్వం రివీల్ చేస్తోంది.

ఇటీవల తాను గర్భవతిని అని ఆలియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆలియా -రణబీర్ కి ఇద్దరు పిల్లలు పుడతారని జ్యోతిష పండితులు కూడా చెప్పేస్తున్నారు. అయితే రణబీర్ కపూర్ తన ప్రియురాలు ఆలియా భట్ ని పెళ్లి చేసుకునే ప్రతిపాదన చేసిన క్రమంలో క్లిక్ మనిపించిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆలియాకు ప్రపోజ్ చేసిన తర్వాత వారిద్దరి ఎంత ఎగ్జయిటింగ్ గా ఉన్నారో ఈ ఫోటో ఆవిష్కరిస్తోంది. రణబీర్ చేతిలోని ఆ బాక్స్ చూశాక అతడు ఆలియాకి ఖరీదైన రింగ్ ని తొడిగాడని అర్థమవుతోంది.

రణబీర్ కపూర్ కెన్యా పర్యటనలో మసాయి మారా నేషనల్ రిజర్వ్ లో అలియా భట్ కి ప్రపోజ్ చేశాడు. ఇక ఫ్రెగ్నెన్సీ ప్రకటన వేళ ఆలియా షేర్ చేసిన ఫోటోలు కూడా చాలా మీనింగ్ ని కలిగి ఉన్నాయి. ఆ ఇద్దరి నడుమా ప్రేమ చిగురించాక పెళ్లి ప్రపోజల్ చేశాక ఆ ఆనంద క్షణాలను ఆలియా తన మదిలో ఇలా పదిలపరుచుకుంది. ఇప్పుడు ఏకంగా ఈ బ్యూటీ మామ్ అయిపోతోంది.

పెళ్లి తర్వాత రణబీర్ నటించిన బ్రహ్మాస్త్ర- శంషేరా లాంటి భారీ చిత్రాలు విడుదలకు వస్తున్నాయి. రణబీర్ దేశంలోనే గొప్ప పాన్ ఇండియా స్టార్ కావాలని రిషీ కపూర్ కోరుకునేవారు. ఇప్పుడు అది నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాల్లో ఉన్నాడు. తనకు ఆలియా కొండంత అండగా నిలుస్తోంది. రణబీర్ చిత్రాలకు బోలెడంత ప్రచారం చేస్తోంది.