సాహో లేడీ విలన్ కంటే ముదురు

Wed Nov 20 2019 18:48:19 GMT+0530 (IST)

Alison Doody in #RRR Movie

47 వయసులో బాలీవుడ్ హాట్ గాళ్ మందిర భేడీ చలాకీతనం గురించి తెలిసిందే. సాహో చిత్రంలో కాస్తంత డీసెంట్ గానే కనిపించింది కానీ.. ఆ సినిమా రిలీజ్ సమయంలో వరుస ఫోటోషూట్లతో బికినీలో మందిర ఎంతో ఇండీసెంట్ గా రెచ్చిపోతే దానిపై కుర్రకారు అంతే ఘాటుగా స్పందించారు. సాహో వల్ల తనకు వచ్చిన పాపులారిటీ కంటే ఆ బోల్డ్ ఫోటోషూట్లతోనే మందిరకు అంత గుర్తింపు దక్కింది. వయసు యాభైకి దగ్గర పడుతున్నా ఈవిడ వ్యవహారమేమిటో! అంటూ సెటైర్లు వేశారు కొందరైతే.అది సరే కానీ.. ఇప్పుడు మందిరను కొట్టే అమ్మమ్మనే దించుతోంది ఆర్.ఆర్.ఆర్ టీమ్. ఆవిడ వయసు 53. కానీ ఆ వాలకం చూస్తుంటేనే జస్ట్ 23 అని ఫిక్సయిపోవాల్సి వస్తోంది. అయినా వయసుతో పనేం ఉంది మనసుండాలే కానీ! అంటారా? RRR లేడీ విలన్ ఆలిసన్ డూడీని చూశాక ఎవరైనా ఇదే విధంగా అభిప్రాయపడతారు.

ఫేమస్ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్ లో అదిరిపోయే ట్రీటిచ్చిన ఈ బ్యూటీ జక్కన్న చిత్రానికి ఓకే చెప్పిందంటే ఇక ఇందులో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ చిత్రంలో లేడీ విలన్ గా నటించనుంది అలీసా డూడీ. సౌత్ ఇండియన్ సినిమా సరిహద్దులు చెరిపేసి పాన్ ఇండియా కేటగిరీలో చేరిపోవడంతో ఇటీవల హాలీవుడ్ స్టార్లు సైతం మన సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ లో బాహుబలి తర్వాత ఇదో ట్రెండ్ గా మారింది. అప్పట్లో మందిర భేడి వయసు గురించి ఆరాలు తీసి 47 అని తెలుసుకున్నాక మరీ ఇంత ముదురా? అంటూ సెటైర్లు వేశారు. కానీ ఇప్పుడు ఈ డూడీని చూశాక మాత్రం అభిప్రాయం మార్చుకునేట్టే ఉన్నారు యూత్.