Begin typing your search above and press return to search.

ఇలా కోలుకోగానే అలా మొద‌లెట్టేసిందిగా..!

By:  Tupaki Desk   |   19 April 2021 1:30 AM GMT
ఇలా కోలుకోగానే అలా మొద‌లెట్టేసిందిగా..!
X
నిన్న‌టివ‌ర‌కూ కోవిడ్ కి చికిత్స పొందిన ఆలియా ఇప్పుడు కోలుకుని త‌న ద‌ర్శ‌కుల‌కు ఫోన్ ల‌లో ట‌చ్ లోకి వ‌చ్చింది. తొలిగా ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళికి ఫోన్ చేసి ఆర్.ఆర్.ఆర్ షూట్ కోసం తాను సిద్ధంగా ఉన్నాన‌ని ఆలియా చెప్పారు. అయితే ఇక్క‌డా కోవిడ్19 పరిస్థితి ఏమంత బాలేదు. మ‌న స్టార్లు అందుబాటులో లేరు. దీంతో ఇప్ప‌ట్లో వెంట‌నే షూట్ స్టార్ట్ చేసే ప‌రిస్థితి లేదు.

అటు ముంబైలో షూటింగులు బంద్ చేయ‌డంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి. గంగూభాయి ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ కూడా అందుబాటులో లేరు. ఇక ఈ తీరిక స‌మ‌యాన్ని ఆలియా ఎలా గ‌డ‌పాలి? అంటే ఇదిగో ఇలా వాట‌ర్ బేబీగా మారిపోయింది. వీలున్నంత వ‌ర‌కూ స్విమ్ చేసి సేద దీరేందుకు ఆస‌క్తిగా ఉంది.

మ‌రోమారు గోవా - మాల్దీవుల విహారానికి ఆలియా రెడీ అవుతోంద‌ట‌. అంటే ఇక‌పై నిరంత‌రం వేడెక్కించే బికినీల‌తో అన్ లిమిటెడ్ ట్రీట్ ఉండ‌నుంద‌నే దీని సంకేతం. అన్న‌ట్టు ప్రియుడు ర‌ణ‌బీర్ కూడా షూటింగుల్లేక ఖాళీనే. క‌లిసే టూర్ లు ప్లాన్ చేస్తున్నారా? అన్న‌ది ఆలియానే చెప్పాలి. తాజాగా ఆలియా షేర్ చేసిన పూల్ సైడ్ ఫోటో వేడి పెంచుతోంది. ల‌వ్ సింబ‌ల్స్ తో గాగుల్స్ సూప‌ర్బ్. అభిమానుల గుండెల్లో ల‌బ్ డ‌బ్ బ‌దులుగా లవ్ ల‌వ్ అని మోతెక్క‌డం ఖాయం.