విక్కీ-క్యాట్ రికార్డుని బీట్ చేసిన నవ దంపతులు!

Sat May 14 2022 11:00:07 GMT+0530 (IST)

Alia Ranbir Wedding Pics are the Most Liked On Instagram

ఇన్ స్టాలో సెలబ్రిటీలో క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల్ని ఇన్ స్టా శాషించే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఎవరెంత ఫేమస్ అన్నది ఇన్ స్టా ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఆ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంతగా పాపులర్ అయినట్లు. ఆ లెక్క తక్కువగా ఉంటే? మాత్రం ఇమేజ్ డ్యామేజ్ అయినట్లే. ఆ రేంజ్ లో ఇన్ స్టా శాషిస్తుంది.హీరో..హీరోయిన్లు తమ ఖాతాల్లో ఎలాంటి పోస్టులు చేసినా క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. వ్యక్తిగత విషయాలు..ఫ్యామిలీ టాపిక్స్ తీసుకొస్తే వాటికి ఇంకా క్రేజ్ ఉంటుంది. సినిమా విశేషాలు కన్నా వ్యక్తిగతంగా సెలబ్రిటీలు ఎలా ఉంటారు? అన్న ఉత్సకత సహజంగా అందరిలోనూ  ఉంటుంది. ఇప్పుడా ఉత్సాహమే  అలియాభట్ ఇన్ స్టా ఫాలోవర్స్ ని మరింతగా పెంచిందని చెప్పొచ్చు.

ఇటీవలే రణబీర్ కపూర్ -అలియాభట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ తంతకు సంబంధించిన ప్రతీ ఫోటోని అలియా అభిమానులతో పంచుకుంది.   మెహందీ..సంగీత్ కార్యక్రమాల దగ్గర నుంచి పెళ్లి తంతు  ముగిసే వరరకూ ప్రతీఫోటోని అభిమానులకు ఇన్ స్టా ద్వారా రీచ్ అయ్యేలా చేసింది. ఎంతో సమయం సైతం కేటాయించి వాటికి అద్భుతమైన క్యాప్షన్స్ ఇవ్వడం..రణబీర్ గురించి వ్యక్తిగతంగా తన అభిప్రాయాలు చెప్పడం వంటివి చేసింది.

పెళ్లి  కార్యక్రమం ముగిసిన వెంటనే ఆ ఫోటోల్ని ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ నేపథ్యంలో అలియాభట్ ఇన్ స్టాలో అరుదైన ఘనత సాధించింది. ఈ ప్లాట్ ఫాం పై అలియాభట్-రణబీర్ కపూర్ వివాహ ఫోటోల్ని ఎక్కువ మంది ఇష్టపడ్డారు.  వీటికి 13 మిలియన్ల మంది లైక్ లు కొట్టారు. ఇన్ స్టాలో ఇది  ఓ రికార్డుగా చెప్పొచ్చు.

ఇంతకు ముందు ఈ రికార్డు కత్రినా కైప్-విక్కీ  కౌశల్ దంపతుల పేరిట  ఉండేది. ఆ జంట వివాహ ఫోటోల్ని 12.7  మిలియన్ల మంది లైక్ చేసి రికార్డుకు  ఎక్కారు.  తాజాగా ఆ రికార్డుని రణబీర్ దంపతులు బీట్ చేసారు. ఇక అనుష్క శర్మ-విరాట్ కొహ్లీ దంపతుల పెళ్లి ఫోటోలకైతే 3 మిలియన్లకు పైగా  లైకులు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ రికార్డులన్నింటని తుడిచిపెట్టే సత్తా ఎవరికి ఉందంటే?  అర్జున్ కపూర్- మలైకా అరోరా జంటకు ఉందని  గుసగుస వినిపిస్తుంది.

ఈ జంట చాలా మందికి నచ్చకపోయినా  ఇన్ స్టాలో అప్ లోడ్ అయితే వచ్చే లైకులు..షేర్ల సంఖ్య మాత్రం మాములుగా ఉండదు. విమర్శిస్తూనే లైక్ లు దక్కిచుకోవడం ఈ జంట ప్రత్యేకత. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఆ విమర్శలకు ఓ కారణమైతే..అదే రీజన్  వాళ్లకి అంతకంతకు పాపులారిటీ తెచ్చిపెడుతుంది అన్నది అంతే వాస్తవం.