ఈ స్టార్ కపుల్ మ్యారేజ్ ఇప్పట్లో కాదట..!

Tue May 04 2021 09:00:02 GMT+0530 (IST)

Alia Ranbir Push The Magical Date Further

సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ జంటలను చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే అదే జంట ఏకంగా పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైతే ఇంకా ఫ్యాన్స్ ఆనందమే వేరు. అలా షూటింగ్స్ లో ప్రేమలు పుట్టుకొచ్చి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ కొన్ని జంటలు పెళ్లి వరకు వెళ్లకుండా మధ్యలో ఆగిపోతాయి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో మనస్పర్థలు అనేవి కామన్. ఈ హీరో ఇంకో హీరోయిన్ తో.. ఆ హీరోయిన్ మరో హీరోతో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటి అనుమానాలతో విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ లవ్ - బ్రేకప్ లొల్లి ఎక్కువగా వినిపిస్తుంది.కానీ కొందరు మాత్రమే లవ్ లో పడి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి ప్రేమజంటగా పాపులర్ అవుతున్నారు హీరో రన్బీర్ కపూర్ - హీరోయిన్ అలియాభట్. ఇద్దరూ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా ప్రేమలో కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి మాత్రమే మిగిలి ఉంది. కానీ పెళ్లి పై ఈ జంట ఏమి స్పందించడం లేదు. అందులోను ఈ కరోనా మహమ్మారి రావడంతో జరగాల్సిన కార్యాలు అన్నికూడా వాయిదా పడుతూ ఉన్నాయి. ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మేటర్ రన్బీర్ - అలియా మ్యారేజ్.

మరి ఇంకెప్పుడు అంటే.. బాలీవుడ్ వర్గాలలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. రన్బీర్ కపూర్ గతేడాది తన తండ్రిని కోల్పోయాడు. అందుకే ఇప్పట్లో పెళ్లి పై పెద్దగా ఇంటరెస్ట్ లేదట. అలాగే చేతినిండా సినిమాలున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం కరోనా టైం.. అసలే కరోనా సోకి ఈ జంట ఇటీవలే బయటపడింది. ఓ మాంచి టూర్ కూడా వెళ్లారు. కానీ పెళ్లి మాత్రం ఇప్పట్లో జరిగేలా లేదు. కుదిరితే వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.