Begin typing your search above and press return to search.

RRR ప్రత్యేక పాట కోసం ఆలియా పాట్లు

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:51 PM GMT
RRR ప్రత్యేక పాట కోసం ఆలియా పాట్లు
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి RRR పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్- తార‌క్ స‌న్నివేశాలు ఆలియాతో సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. ఇందులో అలియా సీతగా కనిపిస్తుంది. ఇప్ప‌టికే త‌న లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.

అయితే అనూహ్యంగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ లో ప‌లువురు స‌భ్యుల‌తో పాటు ఆలియాకు కోవిడ్ 19 పాజిటివ్ రావ‌డంతో షూటింగుల‌కు బ్రేక్ ప‌డింది. ఆ త‌ర్వాత అంతా చికిత్స‌తో కోలుకున్నారు. ప్ర‌స్తుతం తిరిగి షూటింగ్ ని ప్రారంభించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. అతి త్వరలో అలియా సెట్స్ లో జాయిన్ కానుంది. ఇందులో కీల‌క‌మైన‌ పాట కోసం ఆలియా ఇప్పుడు జిమ్ లో తీవ్రంగా శ్ర‌మిస్తోంద‌ని స‌మాచారం. ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ కోసం కొన్ని కిలోలు కోల్పోవాలని రాజమౌలి కోరినందున అలియా జిమ్ లో అడుగుపెట్టింద‌ట‌. ఈ పాటలో అలియాతో పాటు చరణ్ కూడా క‌నిపిస్తారు.

ఇక వ్యాయామం విష‌యంలో ఆలియా క‌మిట్ మెంట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. స‌రైన ఆహార నియ‌మాలు పాటిస్తూ జిమ్ యోగా సెషన్స్ కి అటెండ‌వుతుంది. నిజానికి అలియా భట్ ఒకప్పుడు అధిక బరువుతో ఉండేది. క‌థానాయిక ఆవాల‌నే ల‌క్ష్యంతో అమాంతం 30కేజీలు పైగా త‌గ్గింది. పిజ్జాలు బ‌ర్గ‌ర్లు తినే అల‌వాటున్నా వాట‌న్నిటినీ క‌ట్టేసుకుని అనుకున్న‌ది సాధించింది. ఇప్పుడు రాజ‌మౌళి పిలుపు మేర‌కు ఆలియా మ‌రోసారి షేప‌ప్ చేస్తోంద‌న్న‌మాట‌.