Begin typing your search above and press return to search.

#RRR బ్యూటీకి హెయిర్ కట్ చేసిన ప్రియుడు

By:  Tupaki Desk   |   18 May 2020 5:08 AM GMT
#RRR బ్యూటీకి హెయిర్ కట్ చేసిన ప్రియుడు
X
రాజమౌళి ప్రతిష్టాత్మక భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తాజాగా పోస్ట్ చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత రెండు నెలలుగా ఈమె లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది. ఐ సమయంలో ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి సమయాన్ని గడుపుతుంది.

తాజాగా ఈమెకు రణబీర్ కపూర్ స్వయంగా హెయిర్ కట్ చేసి తన ప్రేమను చూపించాడు. లాక్ డౌన్ కారణంగా గత కొంత కాలంగా సెలబ్రెటీలు కనీసం బ్యూటీ పార్లల్ కు కూడా పోలేని పరిస్థితి. అందుకే చాలా మంది సెలబ్రెటీలు ఇంటివద్దే తమ అందానికి మెరుగులు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఆలియా భట్ కూడా తన కొత్త లుక్ అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది.

రిషి కపూర్ మరణం నుండి రణబీర్ కపూర్ ను వెంటనే బయటపడేలా చేసింది అలియా భట్ చేసిందని బాలీవుడ్ వర్గాల టాక్. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. రిషి కపూర్ మృతి చెందకుండా ఉంటే మరింత తొందరగా వీరి వివాహం అయ్యేది. కానీ ఇప్పుడు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.