పుట్టబోయే బేబీ కోసం స్టార్ హీరో విదేశాల్లో షాపింగ్

Tue Jun 28 2022 18:22:12 GMT+0530 (IST)

Alia Bhatt Ranbeer Kapoor

బాలీవుడ్ క్యూట్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు తల్లిదండ్రులు అవ్వబోతున్నారు. వీరి నుండి ఇంత త్వరగా ఇలాంటి ప్రకటన వస్తుందని.. వీరి గురించి ఇంత త్వరగా ఇలాంటి వార్తలు వింటామని ఏ ఒక్కరు భావించలేదు. హీరోయిన్ గా ఆలియా భట్ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె తల్లికాబోతున్నట్లుగా వార్తలు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు.హీరోయిన్ గా ఆలియా భట్ దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యారు. ఎన్టీఆర్ తో ఆలియా సినిమా చేయబోతున్నట్లుగా  మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె గర్బవతి అంటూ క్లారిటీ రావడంతో ఎన్టీఆర్ సినిమా లో ఆమె నటించడం లేదని క్లారిటీ వచ్చింది.

ఇక ఆలియా భర్త రణబీర్ కపూర్ షంషేరా మరియు బ్రహ్మస్త్ర సినిమాల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరో వైపు తన తాజా సినిమా ల షూటింగ్స్ లతో కూడా బిజీగా ఉన్నాడు. వరుసగా సినిమా ల్లో నటిస్తున్న రణబీర్ కపూర్ ప్రస్తుతం స్పెయిన్ లో ఒక సినిమా షూటింగ్ కోసం ఉన్నాడు. అక్కడ షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు తన సంతోషాన్ని స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడట.

తాజాగా తన పుట్టబోయే బేబీ కోసం అక్కడ షాపింగ్ కూడా చేశాడట. న్యూ బార్న్ బేబీ కోసం డ్రస్ లు ఇంకా బాడీ నీడ్స్ ను కొనుగోలు చేశాడంటూ రణబీర్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు. రణబీర్ కపూర్ తండ్రి కాబోతున్నాడు అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఎగ్జైట్ తో ఎదురు చూస్తున్నారట.

ఆలియా మరియు రణబీర్ ల జోడీ ఇంత త్వరగా తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. పెళ్లికి ముందే ఆలియా గర్భవతి అయ్యిందా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైతేనేం మొత్తానికి ఆలియా మరియు రణబీర్ లు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు మరియు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.