చీరలో అదిరేలా అలియా అందాలు..!

Sat Apr 01 2023 18:00:01 GMT+0530 (India Standard Time)

Alia Bhatt Goregous Clicks In A Saree

అతి కొద్ది మంది టాలెంటెడ్ బాలీవుడ్ నటీమణుల్లో అలియా భట్ ఒకరు. అందానికి అందం అభినయానికి అభినయం అలియా సొంతం. ఎలాంటి పాత్ర వచ్చినా అందులో జీవించేస్తుంది. కేవలం హిందీ చిత్రాల్లోనే కూడా తెలుగులో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించింది. పెళ్లై తల్లి అయిన తర్వాత కూడా అలియా తన గ్లామర్ ను ఏమాత్రం కోల్పోలేదు. ప్రసవం తర్వాత తిరిగి సాధారణ స్థితికి వచ్చేసింది. అంటే ఫిట్ గా మారిపోయింది.సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా పర్సనల్ లైఫ్ కు సమయం కేటాయించినా అభిమానులకు మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అలియా భట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో చీరకట్టుతో రెచ్చిపోయింది.

గత రాత్రి జరిగిన ఎన్ఎంఏసీసీ ఓపెనింగ్లో అలియా భట్.. అందంగా ముస్తాబై వచ్చింది. అలాగే ఉత్తమ దుస్తులు ధరించిన తారల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె వెండి సీక్విన్డ్ చీరలో అదిరిపోయింది. హెవీ వర్క్ ఉన్న హ్యాండ్ లెస్ బ్లౌజులో అలియా మెరిసిపోతోంది. నెట్టెడ్ క్లాత్ వంటి చీరలో అందాలను ఆరబోసింది.

సిల్వర్ రంగులో ఉన్న చీర బ్లౌజుతో పాటు చందమామలా చక్కగా కనిపిస్తోంది. ఈ చీర మీదకు హెవీ చోకర్ విత్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అలాగే డిజైనర్ బిగ్ బ్యాంగిల్ పెట్టుకొని క్యూట్ గా చూస్తోందీ హాట్ బ్యూటీ. ఓ వైపు క్లీవేజ్ షో చేస్తూనే మరోవైపు తన కళ్లతోనే కుర్రకారుకు మత్తెక్కిస్తుంది.

ఆమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 21 లక్షలకుపైగా లైకులు వేలల్లో కామెంట్లు వచ్చాయి. అదిరిపోయావు స్టన్నింగ్ హాట్ బ్యూటీ అంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఒక్క ఇన్ స్టా వేధికగానే అలియా భట్ కు 76.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పటి వరకు ఆమె 1912 పోస్టులు పెట్టింది. వీటన్నిటికి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున లైకులు షేర్లు కామెంట్లు చేశారు.