హాలీవుడ్ ఎంట్రీకి ముందే 16 దేశాల్లో అలియా ట్రెండింగ్!

Sat Aug 13 2022 19:00:01 GMT+0530 (IST)

Alia Bhatt Film Darlings in Trending

బాలీవుడ్ యంగ్  హీరోయిన్ అలియా భట్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇటీవలే .గంగూబాయి కతివాడి.తో బ్లాక్ బస్టర్  అందుకుంది. తొలి లేడీ ఓరియేంటెడ్ చిత్రంతోనే బాలీవుడ్ లో సత్తా చాటింది. 300 కోట్ల వసూళ్లతో అలియా రేంజ్ ని చాటింది. అటుపై .ఆర్ ఆర్ ఆర్. చిత్రంతో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. సీతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఇటీవల బ్యూటీ నటించిన  డార్క్ కామెడీ నెట్‌ఫ్లిక్స్ చిత్రం .డార్లింగ్స్. రిలీజ్ అయింది. గృహ హింసకు సంబంధించిన సున్నితమైన అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం వీక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. విమర్శకులు మెచ్చిన చిత్రంగా  ఓటీటీలో దూసుకుపోతుంది.
సినిమా విడుదలై వారం కూడా గడవకుండానే  ఓటీటీ దిగ్గజంలో 16 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది.

ప్రఖ్యాత ఆన్ లైన్ పోర్టల్ నివేదిక ప్రకారం  నెట్‌ఫ్లిక్స్‌లో డార్లింగ్స్ గ్లోబల్  స్థాయిలో వెలిగిపోతుంది. 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఓ ఆంగ్లేతర భారతీయ చిత్రానికి అత్యధిక గ్లోబల్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఖ్యాతికెక్కింది.

అమెరికా.. ఆసియా మరియు ఆఫ్రికాలోని 16 దేశాలలో నెట్‌ఫ్లిక్స్  టాప్ 10 జాబితాలో ట్రెండింగ్‌లో ఉంది.  యుఎఇ.. సింగపూర్.. కెన్యా.. మలేషియా.. టొబాగో మరియు ట్రినిడాడ్  దేశాల ప్రేక్షకుల్ని .డార్లింగ్స్. ఫిదా చేస్తుంది.

మొత్తానికి అలియాభట్ హాలీవుడ్ ఎంట్రీకి ముందే ప్రపంచ దేశాల్ని .డార్లింగ్స్. తో ఫేక్ చేస్తుందని చెప్పొచ్చు. నెట్ ప్లిక్స్ లో సినిమా ఈ రేంజ్ లో  సంచలనం సృష్టిస్తుందని ఊహించి ఉండరు. ప్రస్తుతం అలియా పేరు ఇంటా బయటా హాట్ టాపిక్ గా మారింది.

.డార్లింగ్స్. లో అలియాభట్  బద్రునిసా  పాత్రలో నటించింది. విజయ వర్మ హమ్జా అబ్ధుల్ షేక్ పాత్రలో కనిపిస్తాడు. ఇద్దరు ప్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. బద్రునిసా అంకితభావంతో ఉన్న భార్యగా ఉండగా ఆమె భర్త హంజా మాత్రం ఆమెను శారీరకంగా హింసించే  మనస్తత్వం గలవాడు. మద్యం మత్తులో బెండు తీసే భర్త. మత్తు దిగిన తర్వాత అదే భార్యని బ్రతిలాడుకోవడం. చివరికి తాగు బోతు భర్తపై బద్రుసాని శమర శంఖం ఎలా?  పూరించిందన్నది కథ. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించారు.