పవన్ మూవీలో అలీ.. ఇంకా స్నేహితులమే!

Mon May 03 2021 16:00:01 GMT+0530 (IST)

Ali in Pawan movie .. still friends!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి జనసేన పార్టీ పెట్టగానే స్నేహితుడు అలీ ఆయనకు అండగా నిలుస్తాడని అభిమానులు భావించారు. కానీ అలా కాకుండా అలీ వైయస్సార్ సీపీ పార్టీలో చేరారు. దాంతో పవన్ అభిమానులు జనసైనికులు అలీపై సోషల్ మీడియాల్లో తీవ్రవిమర్శలతో నేరుగానే ఎటాక్ చేశారు.ఆ తర్వాత పలు ఎపిసోడ్ల అనంతరం అలీ ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాల్ని ఖండించారు. తాజాగా మరోసారి పవన్ తో స్నేహంపై అలీ స్పందించారు. నిజానికి రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేధాలు ఉండొచ్చు. అంత మాత్రాన స్నేహాల్ని మర్చిపోం.

మేం ఇంకా స్నేహితులమే. ఎప్పటికి కలిసే ఉంటాం. ప్రస్తుత మహమ్మారీ వల్ల కలవడం కుదరలేదు. ఇది తగ్గగానే తిరిగి మామూలే. కలిసి ఏదైనా సినిమాలో నటించే వీలుంది కూడా.. అంటూ అలీ సుదీర్ఘంగా మనసు విప్పి మాట్లాడారు. మొత్తానికి పాత స్నేహితులు కలుస్తున్నారన్నమాట.