Begin typing your search above and press return to search.

అల హిట్టు ప్ర‌భావం 'భీష్మ‌' పై!

By:  Tupaki Desk   |   26 Jan 2020 5:37 AM GMT
అల హిట్టు ప్ర‌భావం భీష్మ‌ పై!
X
సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో హిట్టు ప్ర‌భావం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నేలేదు. మంచి స‌క్సెస్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే సినీజనం ఆ ఒక్క హిట్టు కోసం అంత‌గా ప‌రిత‌పించి పోతుంటారు. ఏళ్ల త‌ర‌బ‌డి ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే గ‌త కొన్నేళ్లుగా బంప‌ర్ హిట్టు ప‌డ‌క హారిక హాసిని సంస్థ దాని అనుబంధ సంస్థ సితార ఎంట‌ర్ ట‌న్ మెంట్స్ ఎంతో స్ట్ర‌గుల్ ని ఫేస్ చేశాయి. మంచి సినిమా తీసినా డ‌బ్బులు రాక‌పోవ‌డం ఈ నిర్మాణ సంస్థ‌ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామంగానే ఉండేది.

ప్ర‌తిసారీ సినిమా రిలీజ‌య్యాక‌.. కాంప‌న్సేష‌న్ పేరుతో పంపిణీ వ‌ర్గాల్ని శాంతింప‌జేయాల్సి వ‌చ్చేది. లెక్క‌లు స‌ర్ధి చెప్పాల్సి వ‌చ్చేది. సితార నిర్మించిన గ‌త చిత్రం జెర్సీ చ‌క్క‌ని క్లాసిక్ అని టాక్ వ‌చ్చినా ఆశించిన వ‌సూళ్ల‌ను తేలేక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. అందుకే ఈసారి అల వైకుంఠ‌పుర‌ములో బంప‌ర్ హిట్ కొట్టేయ‌డంతో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ఫుల్ స్వింగులోకి వ‌చ్చేసిందిట‌.

అల .. హిట్టు ప్ర‌భావం త‌దుప‌రి ప్రాజెక్ట్ భీష్మ‌పై ప‌డింద‌ట‌. మొన్న షూటింగుకి ప్యాక‌ప్ చెప్పేసిన వీళ్లు ఇప్పుడు నాలుగు డ‌బ్బులు క‌ళ్ల జూడ‌డంతో భీష్మ‌ను తిరిగి జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం సాంగ్ షూట్ చేస్తున్నారు. ప్ర‌తిసారీ సినిమా మారాక ఇంకో సినిమా చేయాలంటే కొంత సందిగ్ధ‌త ఉండేది. కానీ ఈసారి అలా లేదు. సంక్రాంతి బ‌రిలో అల వైకుంఠ‌పుర‌ములో బంప‌ర్ హిట్ కొట్టింది. ఇంటా బ‌య‌టా ఈ చిత్రం చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించింది. బ‌న్నికి వంద కోట్ల క్ల‌బ్ సినిమాని ఇచ్చారు. అందుకే ఈ హుషారులో నితిన్ తో భీష్మ‌ను ప‌రుగులు పెట్టిస్తున్నార‌ట‌.